బేబ‌మ్మ మాజాకా.. వ‌రుస ఫ్లాపుల్లోనూ రూ. 100 కోట్ల ప్రాజెక్ట్ ప‌ట్టేసింది!

యంగ్ బ్యూటీ కృతి శెట్టికి గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపుల‌తో తీవ్రంగా సతమతం అవుతున్న సంగతి తెలిసిందే బేబమ్మకు బంగార్రాజు తర్వాత మరో హిట్టు పడలేదు. ది వారియ‌ర్‌, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇలా కృతి శెట్టి నటించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

రీసెంట్గా `క‌స్టడీ` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో నాగచైతన్య హీరోగా నటిస్తే.. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తెలుగు తమిళ భాషలో విడుదలైన ఈ సినిమా సైతం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో కృతి శెట్టి కెరీర్ క్లోజ్ అని అంత అనుకున్నారు. కానీ వ‌రుస ఫ్లాపుల్లోనూ ఆమె ఏకంగా రూ. 100 కోట్ల ప్రాజెక్ట్ ను పట్టేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవితో కృతి శెట్టి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఇటీవ‌ల `పొన్నియిన్ సెల్వన్ 2` బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న జ‌యం ర‌వి.. త‌న 32వ చిత్రాన్ని అతిపెద్ద తమిళ బ్యానర్ వేల్స్ ప్రొడక్షన్ లో చేయ‌బోతున్నాడు. మిస్కిన్ మాజీ అసోసియేట్ భువనేష్ అర్జునన్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. దాదాపు వంద కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా ఫిక్స్ అయింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ట‌.

Share post:

Latest