వైర‌ల్ వీడియో: డ్యాన్స‌ర్ గా మారిన డైరెక్ట‌ర్.. అనిల్ రావిపూడికి ఈ టాలెంట్ కూడా ఉందా?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి ఒక‌డు. ర‌చ‌యితగా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి.. `పటాస్` మూవీతో డైరెక్ట‌ర్ గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్స్ ను అందుకుంటూ అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా పేరు సంపాదించుకున్నాడు.

ప్ర‌స్తుతం ఈయ‌న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `ఎన్‌బీకే 108` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. శ్రీ‌లీల కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. శర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి గొప్ప డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాదు మంచి డ్యాన్స‌ర్ కూడా.

గతంలోనే కొన్ని సార్లు ఈ విషయం రుజువు అయింది. తాజాగా మరోసారి త‌న టాలెంట్ ను అంద‌రికీ చూపించాడు. షూటింగ్ సెట్స్‌లో ఫైట్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్లతో కలిసి ఫేమస్ `బాలయ్యా బాలయ్యా` పాటకు అనిల్ రావిపూడి డ్యాన్స్ చేశాడు. అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అంద‌రినీ ఎట్రాక్ట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు అనిల్ రావిపూడి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. స్టార్ హీరోల‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా అనిల్ డ్యాన్స్ వేస్తున్నాడ‌ని కొనియాడుతున్నారు.

Share post:

Latest