హాట్ టాపిక్ గా `ఆదిపురుష్‌` ర‌న్ టైమ్‌.. వామ్మో మ‌రీ అన్ని గంట‌లా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణుడిగా న‌టించారు. ఈ మైథలాజికల్ యాక్ష‌న్ డ్రామా జూన్ 16న వివిధ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

నిజంగా ఈ సినిమాపై మొద‌ట పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా టీజ‌ర్ రిలీజ్ స‌మ‌యంలో ఆదిపురుష్‌ను ప్ర‌భాస్ అభిమానులు సైతం ట్రోల్ చేశారు. వీఎఫ్‌ఎక్స్ పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ, ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత క‌థ మొత్తం మారిపోయింది. . ఇన్ని రోజులు ఈ సినిమాపై వచ్చిన నెగెటివిటీ అంతా ఒక్క ట్రైలర్‌తో పటాపంచలయింది. సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇక‌పోతే ప్ర‌స్తుతం ఆదిపురుష్ ర‌న్ టైమ్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆదిపురుష్ మూవీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. అంతేకాదు, ఈ సినిమాకు ఏకంగా 174 నిమిషాలు(రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు) ర‌న్ టైమ్ గా లాక్ చేశారు. అంటే దాదాపు ఈ మూవీ మూడు గంటల పాటు రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న మాట. ఈ విష‌యం తెలిసి వామ్మో మ‌రీ అన్ని గంట‌లా అంటూ సినీ ప్రియులు ఆశ్చ‌ర్చ‌పోతున్నారు.

Share post:

Latest