హీరోయిన్ ఛార్మి గురించి తెలుగునాట తెలియనివారు పెద్దగా ఎవరూ ఉండరని చెప్పుకోవాలి. ఆమె సినిమా కెరీర్ చాలా సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఆ నిర్మాణ సంస్థలో వరుసగా సినిమాలను నిర్మిస్తుంది ఛార్మి. నాలుగు పదుల వయసుకు చేరువ అవుతున్న చార్మి ఇంకా అంతే అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండడం కొసమెరుపు. అయితే నిర్మాతగా మారిన ఛార్మి తర్వాత సినిమాల్లో కనిపించేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.
పూరికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రొడక్షన్ కి సంబంధించిన పనులు చూసుకోవడంలో ఆమె నిమగ్నమైపోయింది. ఇకపోతే చార్మి 2001 సంవత్సరంలో ‘నీ తోడు కావాలి’ అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఛార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా అలా జరిగిపోయిందట. ఒక రోజు ముంబైలో ఛార్మిని చూసిన ఒక సినిమా వ్యక్తి సినిమాల్లో నటింపజేసేందుకు ఆసక్తి చూపించాడట. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులను సంప్రదించగా అప్పటికి ఛార్మి వయసు కేవలం 14 సంవత్సరాలు అని, ఆమె తల్లిదండ్రులు మరి కొన్నాళ్ల తర్వాత సినిమాల్లో చేయిస్తామంటూ మాట ఇచ్చారట.
ఆ తర్వాత కాలంలో ఛార్మి తల్లిదండ్రులు కొన్ని కండిషన్స్ మధ్య కూతురుని సినిమాలో నటింపజేశారు. చదువుకుంటున్న ఛార్మి సెలవు రోజుల్లో మాత్రమే షూటింగ్ కి హాజరు అవుతుందని, షూటింగ్ సమయంలో మాత్రమే తాను సెట్ లో ఉంటాము అని ఆమె తల్లిదండ్రులు కండిషన్ పెట్టి మరీ మొదటి సినిమా చేయించగా అలా 14 సంవత్సరాల వయసులో ఛార్మి హీరోయిన్ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంట్రీ ఇస్తుండగా ఛార్మి అంత పిన్నవయసులో చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. కాగా ప్రస్తుతం ఈ బొద్దుగుమ్మ నాలుగు పదుల వయసుకి చేరువవుతుంది.
ఛార్మి ఏ వయసులో ఇక్కడికి ఎంట్రీ ఇచ్చిందో తెలుసా?
