సర్జరీ చేయించుకున్న కృతి శెట్టి.. ఎక్కడంటే..?

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కృతి శెట్టి ప్రస్తుతం వరుసలాపులతో సతమతమవుతోంది. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ పరాజయాన్ని అందుకుంటున్నాయి. దీంతో ఈమె గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. మొదట ఉప్పెన సినిమాతో తన కెరీయర్ని మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈమె ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు అభిమానులను కాస్త కంగారు పడేలా చేస్తోంది.

ప్లాస్టిక్ సర్జరీ కామెంట్లు తన దృష్టికి రావడంతో కృతి శెట్టి స్పందించి తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది.. తన గురించి వైరల్ గా మారుతున్న రూమర్లను ఎవరు రాస్తున్నారు ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేస్తోంది.. తమకు కూడా కుటుంబం ఉంటుందని ఇలాంటి రూమర్లు విన్న సమయంలో వారు ఎంత ఇబ్బంది పడతారో అంటూ కృతి శెట్టి చాలా ఎమోషనల్ గా తెలియజేస్తోంది.. ఉప్పెన చిత్రంతో కనిపించిన విధంగా ఇప్పుడు కనిపించడం లేదని అంటున్నారని తెలియజేస్తుంది.

ముఖ్యంగా హెయిర్ స్టైల్ లో మార్పులు వల్ల కూడా కొన్నిసార్లు ఫేస్ కొత్తగా కనిపించే అవకాశం ఉంటుందని కృతి శెట్టి తెలియజేసింది.. అంతేకాకుండా ఫీచర్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా మారుతూ ఉంటాయని తెలుపుతోంది. కొన్ని సందర్భాలలో మేకప్ వల్ల కూడా కొత్తగా కనిపిస్తామని అలా కనిపించిన మాత్రన ప్లాస్టిక్ సర్జరీ అనేస్తారా అంటూ ఫైర్ అయ్యింది. ఈ ప్లాస్టిక్ సర్జరీ రూమర్ వల్ల తన చాలా హర్ట్ అయ్యానని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ ముద్దుగుమ్మ ఆచితూచి కదల ఎంపిక విషయంలో అడుగులు వేస్తోంది.

Share post:

Latest