ఓ..షట్..డామిట్.. టోటల్ కధ రివర్స్ .. రాజమౌళి పరువు మొత్తం గంగలో కలిసిపాయే.. ఏంటి జక్కన్న ఈ పనులు..?

Global స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . రీసెంట్గా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని .. ఏకంగా ఆస్కార్ అవార్డు తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో బడా మైండ్ బ్లోయింగ్ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు .

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్ విషయంలో చాలా దూరంగా ఉంటారు జక్కన్న. పక్క హీరోలందరూ ఏదైనా హీరో సినిమా హిట్ అయిన సినిమాలకు సంబంధించిన టీజర్స్ ట్రైలర్స్ రిలీజ్ అయిన ఎంకరేజ్ చేస్తూ ఉంటారు . అయితే రాజమౌళి అలా చేసిన దాఖలాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఒక్క హీరో నాని తప్పిస్తే మరి ఏ హీరోకి రాజమౌళి సపోర్ట్ చేసిందే లేదు . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో మాత్రం రాజమౌళి చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

చాయ్ బిస్కెట్ సంస్థ నుంచి వచ్చిన తాజా చిత్రం “మేం ఫేమస్” చాలా లోటు బడ్జెట్లో తెరకెక్కి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అందుకునింది . మరి ముఖ్యంగా మహేష్ బాబు సైతం ఈ సినిమాను ఓ రేంజ్ లో పొగడేయడం హాట్ టాపిక్ ట్రెండ్ అవుతూ ఉంటే.. అదే లిస్టులోకి డైరెక్టర్ రాజమౌళి కూడా రావడం ఇప్పుడు మరింత హాట్ గా మారింది . ఎప్పుడైనా అరాకొరా ట్వీట్ చేసే రాజమౌళి ఈ సినిమా కోసం సుదీర్ఘంగా భారీ స్థాయిలో కామెంట్ చేయడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

“రాజమౌళి మాట్లాడుతూ.. మేం ఫేమస్ సినిమా తనకు బాగా నచ్చిందని .. చాలా కాలం తర్వాత థియేటర్లో ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశామని ట్విట్ చేశారు . దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ కి మంచి మార్కులు వేశాడు . అంతేనా ప్రధానంగా అంజి మామ పాత్రకు ఇంకొన్ని ఎక్కువ మార్కులు వేశారు . దీంతో సోషల్ మీడియాలో రాజమౌళిని ఏకేస్తున్నారు జనాలు . ఈ సినిమా కంటే ముందు ఎన్నో చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి . మంచి టాక్ ను అందుకున్నాయి. మరి ముఖ్యంగా బలగం లాంటి సినిమా ఎంత నాచురాలిటీగా తెరకెక్కిందో మనకు తెలిసిందే మరి అప్పుడు ఎందుకు మీరు పోస్ట్ చేయలేదు జక్కన్న ..? అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు”.

మీరు కూడా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారా ..? డబ్బులు ఇచ్చిన సినిమాలకు రివ్యూ ఇస్తున్నారా ..? వాట్ ఇస్ దిస్..? అంటూ మండిపడుతున్నారు . దీంతో ఏదో ఊహించుకొని ట్విట్ చేస్తే మరేదోలా జనాలు ఊహించుకొని ఆయనని ట్రోల్ చేస్తున్నారు. చూద్దాం ఈ వివాదం ఎప్పుడు సర్ధుమణుగుతుందో..? మహేష్ బాబు – రాజమౌళి నోరు ఎప్పుడు విప్పితారో..?