సాయి పల్లవి ఇప్పుడు ఎక్కడుంది, ఏం చేస్తుంది..

సాయి పల్లవి ఇప్పటివరకు 20 సినిమాల్లో కూడా నటించలేదు అయినా ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇందుకు కారణం ఆమె అద్భుత నటనా నైపుణ్యం, మంచి వ్యక్తిత్వం, అందం, డ్యాన్స్ స్కిల్స్ అని చెప్పవచ్చు. డబ్బుకు ఆశపడకుండా కేవలం మంచి పాత్రలో నటిస్తే చాలు అనుకునే సాయి పల్లవి లాంటి వారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. సాయి పల్లవి సినిమా కోసం వెయిట్ చేసే అభిమానులు కోట్లాదిమంది ఉన్నారు. అయితే సాయి పల్లవి నుంచి గార్గి తర్వాత ఏ సినిమా రాలేదు. ఆమె నుంచి ఒక మూవీ వస్తే చూసి ఎంజాయ్ చేయాలని అభిమానులు ఎప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అసలు ఇప్పుడు సాయి పల్లవి ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా ఫ్యాన్స్‌కి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాని కూడా పెద్దగా వాడదు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో పాల్గొంటుంది కానీ మిగతా సమయంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. అయితే చాలా రోజులుగా ఆమె నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో పలు ఊహగానాలు తెర మీదకి వస్తున్నాయి. కొందరు ఆమె విదేశాల్లో సెటిల్ అయిందని అంటుంటే మరికొందరు డాక్టర్‌గా సాయి పల్లవి సేవలు అందిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

సాయి పల్లవి ఒక పొలిటిషన్ కుమారుడిని పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. విరాట్ పర్వం గారికి రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో యముడు కాస్త దానికి తగ్గిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ తమిళంలో శివ కార్తికేయతో కలిసి ఒక సినిమా చేసేందుకు ఒప్పుకుంది.