మెహ్రీన్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో మెహ్రీన్ ఒకటి.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మెహ్రీన్.. తొలి సినిమాతోనే తనదైన అందం అభినయం నటనతో ఆకట్టుకుంది. మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు.. సడెన్ గా హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో ఉన్నానని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ నిశ్చతార్థం కూడా జరిగింది. కానీ, పెళ్లి వరకు వెళ్లకుండానే వీరిద్దరూ విడిపోయారు. ఇక ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత మెహ్రీన్ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. మెహ్రీన్ వెండితెరపై కనిపించి చాలా కాలమే అవుతోంది.
ఇదిలా ఉంటే.. మెహ్రీన్ తాజా ఫోటో షూట్ చూసి ఫ్యాన్స్ షాకైపోతున్నారు. పింక్ కలర్ మినీ ఫ్రాక్ లో దర్శనమిచ్చిన మెహ్రీన్.. స్కిన్ షో చేసింది. అయితే ఈ పిక్స్ లో మెహ్రీన్ లుక్ చాలా దారుణంగా ఉందని చెప్పాలి. కెరీర్ లో అరంభంలో మెహ్రీన్ ఎంతో క్యూట్‌గా, హోమ్లీగా కనిపిస్తూ ఆకట్టుకుంది.
కానీ, ఈ మధ్య మెహ్రీన్ బాగా బక్కచిక్కిపోయింది. దాంతో ఆమె ముఖంలో మునుపటి కల ఏ మాత్రం కనిపించడం లేదు. తాజాగా పిక్స్ లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ వామ్మో.. మెహ్రీన్ ఏంటి ఇలా తయారైంది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.