నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావు పూడి కాంబినేషన్లో ఒక చిత్రంలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో బాలయ్య కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయలేదు.. కేవలం NBK -108 చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వడంతో ఈ సినిమా పైన భారీ హైప్ క్రియేట్ అయింది. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు నుంచి అనేక వార్తలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది .అదేమిటంటే ఈ సినిమా టైటిల్ “భగవత్ కేసరి ” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ లైన్ ని కూడా యాడ్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.
ఇందులో బాలయ్య సరికొత్త లుక్కుల మాస్ ఇమేజ్ను మరొకసారి చూపించబోతున్నట్లు సమాచారం. విజయదశమికి ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రం కూడా రివెంజ్ డ్రామాగా తీసుకురాబోతున్నారని ఇందులో వినోదాన్ని మించి భారీ యాక్షన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది బాలయ్య పుట్టినరోజు జూన్ 10వ తేదీ కావడం చేత ఆరోజున ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ని విడుదల చేయబోతున్నారట. ఈ విషయం తెలిసి అభిమానులు కాస్త సంబరపడిపోతున్నారు.