ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మల్టీస్టార‌ర్‌.. ఫ్యాన్స్ కి కిక్కెచ్చే న్యూస్ రివీల్ చేసిన అల్ల‌రి న‌రేష్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అల్ల‌రి న‌రేష్ కాంబినేష‌న్ లో మ‌ల్టీస్టార‌ర్.. ఈ ఊహే చాలా క్రేజీ ఉంది. ఈ క్రేజీ కాంబినేష‌న్ సెట్ అయితే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. అయితే ఈ విష‌యంపై అల్ల‌రి న‌రేష్ ఫ్యాన్స్ కి కిక్కెచ్చే న్యూస్ రివీల్ చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

తాజాగా అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. `నాంది` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌, డైరెక్ట‌ర్ విజయ్ కనకమేడల కాంబోలో తెర‌కెక్కిన యాక్ష‌న్ డ్రామా ఇది. మే 5న అట్ట‌హాసంగా విడుద‌లైన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అల్ల‌రి న‌రేష్ సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేశాడు.

ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే ఒక పవన్ కళ్యాణ్ అభిమాని `మా హీరో తో సినిమా ఎప్పుడు చేస్తావు అన్నయ్యా’ అని అడిగాడు. అందుకు అల్లరి నరేష్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు ‘మీలాగే నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను, పవర్ స్టార్ సినిమాలో ఎలాంటి రోల్ అయినా చెయ్యడానికి నేను సిద్ధం’ అంటూ చెప్పుకొచ్చాడు. అల్ల‌రి న‌రేష్ స‌మాదానంతో ప‌వ‌ర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మీ ఇద్ద‌రి కాంబోలో ఖ‌చ్చితంగా సినిమా ప‌డాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest