అల్లు అర్హ రోల్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో సన్.. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా టాక్ వైరల్ గా మారింది . భారీ అంచనాల నడుమ తెరకెక్కి నేడు రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో.. బాక్సాఫీస్ వద్ద ఓకే ఓకే అంటూ కొనసాగుతుంది . సమంత కెరీర్ లోనే ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ కంటే నెగటివ్ కామెంట్స్ నే ఎక్కువగా దక్కించుకుంటుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో సమంత నటనపై నెగటివ్ కామెంట్స్ వినిపించడం సామ్ ఫ్యాన్స్ కి మింగుడు పడని రాయిగా మారింది.

అంతేకాదు సమంత ఈ పాత్రకు రాంగ్ ఛాయిస్ అని.. వేరే హీరోయిన్ అయితే బాగుండేది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా తెలిసిన కథని తెరకెక్కించడంలో గుణశేఖర్ కూడా భారీగా ఫ్లాప్ అయ్యారు అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే సినిమాలో ఇన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నా సరే అల్లు అర్హ పాత్ర మాత్రం జనాలకి తెగ నచ్చేసింది. చాలా క్యూట్ క్యూట్ గా లిటిల్ బేబీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

మరి ముఖ్యంగా ఈ సినిమా చూసిన తర్వాత సమంత కంటే ఎక్కువ జనాభా ఆల్లు అర్హ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమాలో గుణశేఖర్ మొదట ఈ పాత్ర రాసుకున్నప్పుడు అనుకునింది బేబీ అర్హ ని కాదట . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొడుకును ..ఈ సినిమాలో నటింపజేయాలని భావించారట . అయితే జూనియర్ ఎన్టీఆర్ కి అప్పుడే తన కొడుకులు ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదని.. ఆ కారణంగానే సింపుల్ రీజన్ తో ఈ పాత్రను రిజెక్ట్ చేశారట . ఇక అలాంటి టైం లోనే నీలిమ గుణశేఖర్ అల్లుఅర్హ ని సెలెక్ట్ చేయడం అల్లు అర్జున్ కి చెప్పగానే ఓకే చేయడంతో ఫైనల్లీ అల్లు అర్హా ఈ ప్రాజెక్టులో భాగమైంది . ఏ మాటకు ఆ మాట అల్లు అర్హ ఈ పాత్రలో చించేసింది..!!