చిరు పెద్ద‌ కూతురు సుస్మిత భర్త బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా.. ఆ ఫ్యామిలీ చరిత్ర అంత గొప్పదా..!

మెగాస్టార్ చిరంజీవికి ముగ్గురు సంతానం అనే విషయం అందరికీ తెలిసిందే. అందులో ఇద్దరు కూతుర్లు కాగా ఒక కుమారుడు.. ఇప్పటికే ఆయన కుమారుడు అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి తగ్గ నటుడుగా వరుస‌ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే చిరు చిన్న కూతురు శ్రీజ తన మొదటి భర్తతో విడాకులు తీసుకుని.. ఆ తర్వాత క‌ళ్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది.

మెగా ఫ్యామిలీలో ఆస్తుల అలజడి? అసలు నిజం ఇదే!

అయితే ఇప్పుడు తన రెండో భర్తతో కూడా దూరంగా ఉంటుంది. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలకు త‌ల్లిగా తన తండ్రి వద్దనే ఉంటుంది. ఇక చిరంజీవి పెద్ద కూతురు పేరు సుస్మిత కొణిదెల. ఇక ఈమె ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనే కొనసాగుతూ తన తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తూ రీసెంట్‌గా నిర్మాతగా కూడా మారింది. గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా సినిమాలను వెబ్ సిరీస్ ల‌ను నిర్మిస్తుంది.

Chiranjeevi's Daughter Sushmita Konidela To Make Her Acting Debut With Sridevi Shoban Babu

ఇక సుస్మిత భర్త పేరు విష్ణు ప్రసాద్. ఈయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఏం చేస్తాడు..? వంటి పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సుస్మిత భర్త విష్ణు ప్రసాద్ ఫ్యామిలీ రాయలసీమ అయినప్పటికీ చెన్నైలో స్థిరపడ్డారు. చెన్నైలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త ఎల్.వి రామారావుకు విష్ణుప్రసాద్ మనవడు అవుతాడు.

ఎల్ వి రామారావు కొడుకు ఎల్ వి ప్రసాద్. ఎల్ వి ప్రసాద్, చంద్రి దంపతుల‌కు విష్ణు ప్రసాద్ జ‌న్మించాడు. విదేశాల్లో విష్ణు ప్రసాద్ బిజినెస్ కి సంబంధించి మాస్టర్స్ కంప్లీట్ చేశాడు. ప్ర‌స్తుతం త‌న కుటుంబ వ్యాపారాల‌ను విష్ణు ప్ర‌సాద్ చూసుకుంటున్నాడు.