చేతుల్లారా 100 కోట్లు బొక్క పెట్టుకున్న ప్ర‌భాస్‌.. కర్మ అంటే ఇదేగా..!!

పాన్ ఇండియా హీరో అనగానే అందరికీ ట్క్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్ . బాహుబలి సినిమాతో తన పేరును పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ సంపాదించుకుని ఏకంగా 100 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్న స్టార్ హీరోగా రికార్డు నెలకొల్పిన ప్రభాస్.. ప్రజెంట్ తాను చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అవ్వబోయే ప్రాజెక్ట్ కె సినిమా కోసం ప్రపంచ స్థాయిలో జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . ఈ క్రమంలోనే ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ చేతులారా వదులుకున్నాడు అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హృతిక్ రోషన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా వచ్చిన వార్ సినిమాకి సీక్వెక్ ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే వార్ 2 సినిమా లో ఎన్టీఆర్ నటించబోతున్నాడు అంటూ కన్ఫామ్ అయిపోయింది .

అయితే ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్న తెలుగు హీరో ప్రభాస్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ సినిమా మేకర్స్ ప్రభాస్ కోసం చర్చలు జరిపారని ..ప్రభాస్ రిజెక్ట్ చేస్తేనే ఆ పాత్ర ఎన్టీఆర్ కి చేరింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఈ పాత్ర కోసం ఏకంగా 100 కోట్లు అందుకుంటున్నాడు అంటూ ఓ న్యుస్ ట్రెండ్ అవుతుంది . ఈ విధంగా చూసుకుంటే ప్రభాస్ తన చేతులారా వంద కోట్లు రెమ్యూనరేషన్ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు . ప్రభాస్ రిజెక్ట్ చేయడం వల్ల ఆ పాత్ర ఎన్టీఆర్ కి వచ్చిందని .. ఎన్టీఆర్ ఇక బాలీవుడ్ లో దుమ్ము దులిపేస్తాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!