పుష్ప 2 కోసం బన్ని అలాంటి పని కూడా చేస్తున్నాడా..? ఫ్యాన్స్ కి ఏడుపు ఒక్కటే తక్కువ..!?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా పుష్ప . 17 డిసెంబర్ 2021న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమాని డైరెక్ట్ చేసింది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ . బన్నీ – సుకుమార్ కాంబో అంటే ప్రజలు ఎలాంటి రికార్డులను ఎక్స్పెక్ట్ చేస్తారో మనందరికీ బాగా తెలిసిందే. గతంలో రిలీజ్ అయిన ఆర్య ఆర్య 2 ఆ కాంబో లెక్కలను మార్చేశాయి ఈ క్రమంలోని పుష్ప సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్న బన్నీ అభిమానులకు ఎక్కడ ఆ లోటు లేకుండా ఫుల్ ఫీల్ చేశాడు సుకుమార్ .

ఈ క్రమంలోనే రీసెంట్గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప 2 టీజర్ అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా హిందీ జనాలను పుష్ప2 సినిమా పిచ్చెక్కించేస్తుంది . కాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సినిమా కోసం అల్లు అర్జున్ సపరేట్ డైటీషియన్ ని అప్పాయింట్ చేసుకొని మరి డైట్ ని ఫాలో అవుతున్నారట . మరీ ముఖ్యంగా మాస్ బాడీ లాంగ్వేజ్ ను ఎలివేట్ చేసే విధంగా సుకుమార్ క్లియర్గా సీన్స్ రాయడంతో .. బన్నీ ప్రాణం పెట్టి నటిస్తున్నాడట.

తన కెరీర్ కు ఎంతో ప్లస్ అయ్యే ఈ సినిమా కోసం ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నాడట . పొద్దున లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు ..ఆ డైటీషియన్ చెప్పిన ఫుడ్ నే తీసుకుంటూ నోరు కట్టేసుకొని మరి పుష్ప2 సినిమా కోసం బన్నీ కష్టపడుతున్నారని ..ఇలాంటి సినిమాపై నెగటివ్ ప్రచారం చేయొద్దు అంటూ నెటిజన్స్ కి సలహా ఇస్తున్నారు . అంతేకాదు మంచి ఫుడీ అయినా బన్నీ ఇలా నోరు కట్టేసుకోవడంతో బన్నీ ఫాన్స్ డీలా పడిపోయారు. పుష్ప2 రిలీజ్ అయిన తర్వాత ఓ నెల రోజులు పాటు కుమ్మెయ్ అన్న అంటూ సజెషన్స్ ఇస్తున్నారు..!!