NTR30 కోసం తారక్ అంత సాహసం చేస్తున్నాడా..? అయ్యయ్యో వద్దు తారక్ వద్దు..ప్లీజ్..!!

ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు .. ఇవ్వట్లేదు అంటూ బాధపడిన ఫ్యాన్స్ కి తారక్ బడా బడిగా వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గానే లంఛనంగా ప్రారంభమైన కొరటాల శివ డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమా.. స్టార్ట్ అయింది . దీనికి సంబంధించిన పిక్స్ కూడా అప్పుడే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి .

బ్లడ్ ట్యాంకర్ పిక్ ఇండస్ట్రీని షేక్ చేస్తే.. రెండోది ఏకంగా ఎన్టీఆర్ కి సంబంధించిన మాస్ లుక్ రివిల్ అయింది . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ పందగ చేసుకుంటున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం తారక్ ఈ సినిమా కోసం సపరేట్ డైట్ ని ఫాలో అవుతున్నారట. అంతే కాదు ఈ సినిమాలో మాస్ లుక్స్ లో కనిపించడానికి దానికి తగ్గ బాడీని బిల్డప్ చేస్తున్నారు అంటూ తెలుస్తుంది .

ఈ క్రమంలోనే సపరేటుగా డైటీషియన్ పెట్టించుకుని మరి తారక్ బాడీ లుక్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడట . అంతేకాదు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేవరకు తారక్ పూర్తిగా ఆ డైటీషియన్ చెప్పినట్లే పాటిస్తాడని ..ఈ క్రమంలోనే మాంసం ఎక్కువగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. అయితే మొదటి నుంచి మంచి భోజన ప్రియుడు అయిన తారక్ కి ఈ సినిమా షూటింగ్ పుణ్యమా అంటూ ఫుల్ గా లాగించే ఛాన్స్ వచ్చింది అంటున్నారు కొందరు ఫ్యాన్స్ .

మరికొందరు ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా కోసం మళ్లీ తగ్గాలా..? ఎన్టీఆర్.. అయ్యాయో ఎలాంటి కష్టం వచ్చింది నీకు అంటూ బాధపడిపోతున్నారు . ఏది ఏమైనా సరే అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి కష్టనైనా సరే తీసుకుంటాడు అని మరోసారి ప్రూవ్ చేశాడు ఈ నందమూరి నట వారసుడు..!!