మినీ డ్రెస్ లో మంట‌లు రేపిన అదితి.. హీటెక్కిపోతున్న కుర్ర‌కారు!

అదితి రావు హైదరి.. సౌత్ తో పాటు నార్త్‌ ప్రేక్ష‌కుల‌కు ఈ ముద్దుగుమ్మ సుప‌రిచిత‌మే. మ‌ల‌యాళ చిత్రంతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన అదితి రావు హైద‌రి.. మణిరత్నం దర్శకత్వం వహించిన చెలియా సినిమాతో తెలుగు, త‌మిళ‌ ప్రేక్షకులకు పరిచయం అయింది.

మొద‌టి సినిమాతోనే అందం, అభిన‌యం మ‌రియు న‌ట‌నా ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకున్న ఈ చిన్న‌ది.. స్టార్ హీరోయిన్ గా ఎద‌గ‌లేక‌పోయినా అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూ కెరీర్ ను లాక్కొస్తోంది.

ఇక‌పోతే అదితి గతంలో బాలీవుడ్‌ నటుడు సత్యదీప్‌ మిశ్రాను వివాహం చేసుకుంది. 2009లో వీరిద్దరూ వివాహం చేసుకోగా 2013లో మనస్పర్థలు వచ్చి విడిపోయారు.

అప్ప‌టి నుంచి ఒంటరిగా ఉంటున్న అదితి.. ఈ మ‌ధ్య సిద్దార్థ్ తో డేటింగ్ మొద‌లు పెట్టిందంటూ ప్రచారం మొద‌లైంది. ఇదిలా ఉంటే.. అదితి తాజా ఫోటో షూట్ సోష‌ల్ మీడియాలో దుమారం రేపుతోంది.

బ్లాక్ క‌ల‌ర్ మినీ డ్రెస్ లో సూప‌ర్ హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చి కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపింది అదితి. దాంతో వారు ఆమె అందాల వేడికి త‌ట్టుకోలేక హీటెక్కిపోతున్నారు.

అదితి క్లీవేజ్ షోలో హ‌ద్దులు దాటేసింది అన‌డానికి తాజా ఫోటోలే నిద‌ర్శ‌నం. ప్ర‌స్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుత‌న్నాయి.