సినిమా ఇండస్ట్రీలో నయనతార పేరుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార రీసెంట్ గానే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నానా విధాలుగా ట్రోల్ అవుతున్న ఈ జంట రీసెంట్గా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటుంది . ఈ క్రమంలోని నయనతార తన భర్త తో కలిసి కుంభకోణం సమీపంలోని కుల దేవుడు ఆలయాన్ని సందర్శించింది .
ఆలయ పెద్దలు నయన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు . అంతేకాదు పూజ అనంతరం తీర్థప్రసాదాలతో సత్కరించారు . ఆ తర్వాత వీరిద్దరు కుంభకోణం పక్కనే ఉన్న మలవత్తూరు గ్రామంలోని నది ఒడ్డున ఉన్న తమ కుల దేవత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . కాగా ఇదే టైంలో అక్కడికి వచ్చిన నయన్ ఫ్యాన్స్ ఆమెతో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు . దీంతో కాసేపు అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
అంతేకాదు అభిమానులతో సెల్ఫీ దిగుతుండగా ఓ అమ్మాయి నయన్ భుజాన్ని పట్టుకొని లాగింది. దీంతో కోప్పడిన నయన్ ఉరిమి చూసింది . దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా అనంతరం ఆయన దంపతులు తిరుచి రైల్వే స్టేషన్ కు చేరుకోగా అక్కడ కూడా అభిమానులు హంగామా చేశారు. ఈ క్రమంలోని ఫొటోస్ తీస్తూ ఉండగా నయన్ కు చిరెత్తింది. ఈ క్రమంలోని ఫోన్ లాగి పెట్టి కొడితే పగిలిపోద్ది అంటూ స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చింది . దీంతో నయన్ ఫాన్స్ ఆమెను ఫోటో తీయడానికి భయపడ్డారు . ప్రెసెంట్ దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!