విజయ్‌తో డేటింగ్ రూమర్స్‌పై ఎట్టకేలకు మౌనం వీడిన రష్మిక.. ఏమన్నదంటే!

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ మధ్య రొమాంటిక్ అఫైర్ ఉందని ఎప్పటినుంచో రూమర్స్ వస్తున్నాయి. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. అయితే ఈ సినిమాలలోనే కాకుండా బయట కూడా వీరి మధ్య కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఇక వీరు కలిసి విహారయాత్రలకు వెళ్లడం కూడా అనుమానాలను రేకెత్తిస్తోంది. అలానే రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన ప్రతిసారీ ఆమె విజయ్ ఇంట్లోనే ఉన్నట్లు బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తుంటుంది. దాంతో ఆమె ప్రతి స్పెషల్ అకేషన్‌కి విజయ్ ఇంట్లోనే ఉంటుందని అభిమానులు ఎప్పుడూ కామెంట్ చేస్తూనే ఉంటారు.

అయితే నిన్న అంటే ఏప్రిల్ 5న బర్త్‌ డే సందర్భంగా రష్మిక ఒక వీడియో మెసేజ్ పెట్టింది. ఈ వీడియోలో విజయ్ ఇంటిని పోలి ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కొంతమంది అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇదే క్రమంలో సౌత్ ఇండియన్ మీడియా అనే ఒక ట్విట్టర్ పేజీ రష్మిక, విజయ్ కలిసి జీవిస్తున్నారని, ఆమె అతని ఇంట్లో ఉందని, అతను ఇచ్చిన ఉంగరం ధరించిందని రాసుకొచ్చింది. అయితే, రష్మిక ఆ ట్వీట్‌ను ఖండించింది. “అయ్యో.. దాని గురించి అతిగా ఆలోచించవద్దు బాబూ..”. అని తనదైన శైలిలో ఈ రూమర్ అవాస్తవమని తెలిపింది.

 

ఇటీవల కాలంలో రష్మిక ఇతర యాక్టర్లతో అఫైర్ పెట్టుకుందని కూడా వార్తలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను ఒక ఈవెంట్‌లో, తరువాత విమానాశ్రయంలో కలిసింది. ఇప్పటినుంచి వారి మధ్య ఏదో ఉందని వార్తలు రావడం మొదలయ్యింది. అయితే, ఈ పుకార్లను నటి పట్టించుకోలేదు. ఇక రష్మిక ఇప్పుడు పుష్ప సీక్వెల్ అయిన పుష్ప: ది రూల్, అలాగే వెంకీ కుడుముల, నితిన్‌లతో కలిసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉంది. దేవ్ మోహన్‌తో ఆమె సహనటిగా లేడీ ఒరియంటెడ్ మూవీ కూడా చేస్తోంది. రణబీర్ కపూర్‌, సందీప్ రెడ్డి వంగా కాంబో యానిమల్‌లో కూడా రష్మిక నటిస్తుంది.