‘ రావణాసుర ‘ రిలీజ్‌కు ముందే ఫ్యాన్స్‌కు షాకింగ్ గిఫ్ట్ ఇచ్చిన ర‌వితేజ (వీడియో)

గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో నాచురల్ స్టార్ నాని దసరా సినిమా అదరగొడుతుంది. ఇప్పుడు ఈ వారం నుంచి మరికొన్ని భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధమాకా లాంటి సూపర్ సక్సెస్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా అవటంతో రావణాసురపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mass MahaRaj RaviTeja 'రావణాసుర' రన్ టైం లాక్!

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రవితేజకు జోడి గా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటించారు. రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర లో కనిపించబోతున్నాడు అనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి ఈ సినిమా లో రవితేజ యొక్క లుక్ మరియు ఇతర విషయాలు చాలా ఆసక్తిని కలిగిస్తున్నాయి.

రావణాసుర.. ఇది పెద్ద టాస్కే! | Telugu Rajyam

ఈ సినిమాను విలక్షణ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు మరికొన్ని గంటల ముందు రవితేజ ఓ స్పెషల్ వీడియోని తన అభిమానులతో పంచుకున్నాడు. ఇక మరి ఈ వీడియోలో నాచురల్ స్టార్ నాని కూడా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా రవితేజ డైలాగ్‌ల‌తో అదరగొట్టాడు. రావణాసుర రిలీజ్ తో థియేటర్స్ లో ఫైర్ గా ఉంటుందని అంటున్నారు. దీనితో ఈ స్పెషల్ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ క్రేజీ థ్రిల్లర్ అయితే ఎలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి.