అదే నిజం అయితే .. మెగా ఫ్యామిలీలో మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందా..? ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ ..!!

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్నాయో మనందరికీ బాగా తెలిసిన విషయమే . రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయినప్పటి నుంచి అవార్డు అందుకున్నప్పటి వరకు సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరును ట్రోల్ చేశారు కొందరు పని పాట లేని బ్యాచ్ . కాగా రీసెంట్గా అదే బ్యాచ్ మరోసారి మెగా వారసుడు టార్గెట్గా ట్రోల్ చేస్తుంది.

ఇప్పటికే నిహారిక డివోర్స్ విషయంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని ఏకీపారిస్తున్న ఆకతాయిలు. మరోసారి మెగా ఫ్యామిలీ పై రెచ్చిపోయి ట్రోలింగ్ చేస్తున్నారు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంది. కాగా త్వరలోనే ఈ సినిమా షూట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధం కానుంది.

కాగా రీసెంట్ గా చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టైటిల్ లోగో అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయి . రాంచరణ్ స్థాయికి తగ్గ సినిమా కాదు అంటూ ఫ్యాన్స్ నే చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే మెగా హెటర్స్ గేమ్ చేంజర్ సినిమాని ట్రోల్ చేస్తున్నారు , రాజమౌళి సెంటిమెంట్ వర్కౌట్ అయితే చరణ్ సినిమా ఫ్లాప్ అవుతుందో లేదో తెలియదు కానీ.. శంకర్ డైరెక్షన్ మాత్రం నమ్ముకుంటే చరణ్ కచ్చితంగా మునిగిపోతాడని.. ఇప్పటికైనా చరణ్ మేలుకోకపోతే ఈ సినిమా కచ్చితంగా డిజాస్టర్ గా మారిపోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. చరణ్ ఇప్పటికైనా ఆలోచించకపోతే స్క్రిప్ట్ చేంజ్ చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని.. మెగా ఫ్యాన్స్ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది అంటూ కొందరు జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!