సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు. అప్పటివరకు స్టార్ గా ఉన్న వాళ్ళు జీరో అవ్వడం .. జీరో గా ఉన్న వాళ్ళు స్టార్ అవడం రాత్రికి రాత్రి జరిగిపోతూ ఉంటుంది . కేవలం హీరోల విషయాల్లోనే కాదు హీరోయిన్ విషయాలలోనూ ఇలానే జరుగుతూ ఉంటుంది . ప్రజెంట్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిపోయిన అను ఇమ్మానియేల్ పేరు రేంజ్ లో మారు మ్రోగిపోతుంది మనకు తెలిసిందే.
అను ఇమ్మానుయేల్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మజ్ను సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫస్ట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది . ఆ తర్వాత బడా బడా సినిమాల్లో అవకాశాలు అందుకుంది . అయితే ఏ సినిమా హిట్ కాలేదు . ఈ క్రమంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా అజ్ఞాతవాసి అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది.
అయినా సరే అను ఇమ్మానుయేల్ తర్వాత మారలేదు. ఈ క్రమంలోనే అమ్మడు లాస్ట్ గా నటించిన రావణాసుర సినిమాతో అయినా సరే సినిమా ఇండస్ట్రీ లెక్కలు మార్చేద్దాం అనుకునింది. అయితే రవితేజ లెక్కలనే మార్చేసింది అను ఇమ్మానుయేల్ . ఈ సినిమా డిజాస్టర్ లకే డిజాస్టర్ గా నిలిచింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రవితేజ నటన బాగున్నప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు అంటూ అట్టర్ ప్లాప్ చేసేసారు అభిమానులు. ఈ క్రమంలోనే సినిమాలో హీరో ఓకే అని.. హీరోయిన్ కారణంగానే సినిమా దొబ్బేసి రవితేజ ఫాన్స్ టార్గెట్ చేసే ట్రోల్ చేస్తున్నారు . మరోసారి ఆ హీరోయిన్ తో నటించొద్దు అంటూ మిగతా హీరోలకి సజెస్ట్ చేస్తున్నారు . దీంతో అను ఇమ్మానియేల్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!