సమంత కెరీర్ లోనే తనకి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? అస్సలు గెస్ చేయలేరు ..!!

సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా శాకుంతలం . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరి కొద్ది రోజుల్లోనే గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది . ఏప్రిల్ 14న సమంత శకుంతల దేవి పాత్రలో నటించిన సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే శకుంతలం సినిమా టీం ఫుల్ హంగామా చేస్తుంది . సమంత కూడా ఎక్కడ తగ్గకుండా తనదైన స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తూ సినిమాకి వీలైనంత పబ్లిసిటీ క్రియేట్ చేస్తుంది .

. ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..హోస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోని సమంత ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూకి అటెండ్ అయింది . ఆ ఇంటర్వ్యూలో హోస్ట్ మాట్లాడుతూ ..”ఇప్పటివరకు మీరు ఎన్నో సినిమాల్లో నటించారు ..ఎన్నో సినిమాలకు అవార్డులు అందుకున్నారు . అయితే మీకు పరసనల్ గా నచ్చిన క్యారెక్టర్.. మీ దృష్టిలో మీకు ఏ సినిమా బాగా సూట్ అయిందని అనిపించింది ” అంటూ అడిగారు .

ఈ క్రమంలోనే సమంత.. అందరూ ఏం మాయ చేసావే సినిమా పేరు చెబుతుంది అంటూ అనుకున్నారు. అయితే సమంత ఎవరూ ఊహించని విధంగా ఓ బేబీ సినిమా పేరు చెప్పింది . ఈ సినిమాలో సమంత ఎలాంటి పాత్ర పోషించిందో మనందరికీ తెలిసిందే . సమంతకి ఈ సినిమాలోని పాత్ర చాలా డిఫరెంట్గా అనిపించిందట . ఈ క్రమంలోని ఆ సినిమాను పదే పదే చూస్తూ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుందట. అంతేకాదు సమంతకి ఇలాంటి రోల్ మళ్ళీ వచ్చిన సెకండ్ కూడా ఆలోచించకుండా చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే సమంత చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!