సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు, విడాకులు అన్ని సహజమే సినీ ప్రపంచంలో ఎప్పుడు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురిస్తుందో ఎవరికి తెలియదు. కొంతమంది ప్రేమ వ్యవహారా లను సీక్రెట్ గా నడిపిస్తూ ఉంటారు. మరికొందరు వారి ప్రేమను ఓపెన్ చేసి పెళ్లి వరకు తీసుకు వెళ్తూ ఉంటారు.. మరికొందరు వారిద్దరి మధ్య ఏమీ లేకపోయినా పలు రూమర్ల ద్వారా వార్తల్లో నిలిచిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిని హీరో రామ్ కూడా ఒకరు.
హీరో రామ్ గురించి ఒక వార్త వైరల్ గా మారుతోంది..మొట్ట మొదటిగా తెలుగు ఇండస్ట్రీకి దేవదాస్ అనే చిత్రంతో పరిచయమై రామ్ అభిమానులను బాగ నే సంపాదించుకున్నారు. ఆ తరువాత రెడీ, రామారావు కృష్ణ కృష్ణ, జగడం, పండగ చేస్కో , ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమా ద్వారా మంచి ప్రేక్షకాదరణ పొందాడు. అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు సంపాదించారు.. అంతేకాకుండా రామ్ ఒక్క మాస్ సినిమాలలోనే కాకుండ క్లాస్ సినిమాలో కూడా బాగా నటిస్తూ ఉన్నారు రామ్ .
అయితే హీరో రామ్ ఒక హీరోయిన్ ని ప్రేమించాడని ఆమె కోసమే ఇంకా పెళ్లి చేసుకోలేదని ఒక వార్త జోరుగా వినిపిస్తోంది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే రామ్ తో నటించిన జెనీలియా. అయితే జెనీలియా కు పెళ్లి అయిన సంగతి తెలిసిందే.. కానీ కొంతమంది కావాలని ఆమెనే టార్గెట్ చేస్తున్నట్లు రామ్ ఆమెతో ప్రేమలో ఉన్నట్టు అప్పట్లో పుకార్లు సృష్టించారు.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని వారిద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇలాంటి ఈ పుకార్లను సృష్టించి వారి జీవితాలను నాశనం చేయవద్దని ఆయన అభిమానులు చాలా ఫైర్ అవుతున్నారు.. దీంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడతాయేమో చూడాలి మరి.