`శాకుంత‌లం`కు అల్లు అర్హ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం `శాకుంత‌లం` విడుద‌ల‌కు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ‌కుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మహారాజుగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ న‌టించారు. మోహ‌న్ బాబు, ప్ర‌కాష్‌ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అన‌న్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

ప్యాషనేట్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ తెర‌కెక్కించిన ఈ ఎపిక్ ల‌వ్ స్టోరీ ఏప్రిల్ 14న తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌మోష‌న్స్ తో మేక‌ర్స్ మ‌రింత హైప్ పెంచుతున్నారు. ఇక‌పోతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గార‌ల ప‌ట్టి అల్లు అర్హ శాకుంత‌లంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగ‌ప్ర‌వేశం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అర్హ స‌మంత కుమారుడు లిటిల్ భ‌ర‌తుడి పాత్ర‌ను పోషించింది.

ఆల్రెడీ ఈ క్యూటీ స‌మంత‌తో స‌హా చిత్ర టీమ్ మొత్తం నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా అర్హ చ‌క్క‌గా చెప్పేసింద‌ని.. ఆమె పుట్టుక‌తోనే స్టార్ అని.. సో టాలెంటెడ్ అంటూ అంద‌రూ తెగ పొగిడేస్తున్నారు. అయితే ఇంత‌కీ అర్హ శాకుంత‌లంకు ఎంతో రెమ్యున‌రేష‌న్ తీసుకుందో తెలుసా..? తాజాగా ఈ విష‌యంపై డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ స్పందించారు. అర్హ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో బ‌న్నీకి, త‌న‌కు మ‌ధ్య చ‌ర్చ‌ రాలేద‌ని, అస‌లు ఆయ‌న ఆవేమి ప‌ట్టించుకోర‌ని గుణ‌శేఖ‌ర్ తేల్చేశారు. ఇంత‌వ‌ర‌కు అర్హ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పేశారు. మొత్తానికి అర్హ త‌న మొద‌టి సినిమాను రెమ్యున‌రేష‌న్ తీసుకోకుండానే చేస్తోంది.