boycott pushpa 2: బాలీవుడ్ హీరోలకు ఆ దమ్ము లేదా..? మగాళ్ళు కాదా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా పుష్ప 2. రీసెంట్గా బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన టీజర్ ని గ్రాండ్గా రిలీజ్ చేశారు డైరెక్టర్ సుకుమార్ . ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ అభిమానిని అమితంగా ఆకట్టుకుంది అంతేకాదు మరీ ముఖ్యంగా బన్నీ లోని మాస్ యాంగిల్ ప్రేక్షకులకు పిచ్చిపిచ్చిగా వచ్చేసింది హైలైట్ ఏంటంటే ఈసారి పుష్ప టు టీజర్ ని అన్ని భాషల్లో కల్లా హిందీ భాషలో ఎక్కువగా ఆదరించారు .

అయితే ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకు వణుకు మొదలైన్నత్లు ఉంది. ఈ క్రమంలోనే బన్నీ నటిస్తున్న పుష్ప2 సినిమాను బాయ్ కాట్ చేయాలని సరికొత్త హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. బాలీవుడ్ మీడియా వ్యాప్తంగా పుష్ప2ను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ అమ్మవారి అవతారంలో కనిపించిన పుష్ప2 లుక్ లో .. బన్నీ చేతిలో గన్ ఉంటుంది . ఈ క్రమంలోనే గన్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తున్నాడు బన్నీ అంటూ పుష్ప 2 సినిమాను బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు .

ఈ క్రమంలోని బన్నీ ఫాన్స్ అయితే మండిపడుతున్నారు. “శత్రుసంహార చేయడానికి ఎంతో మంది దేవతలు , దేవుళ్ళు ఆయుధాలు పట్టారు ..అలాగే ఈ తుపాకీ కూడా ఒకటి ..ప్రతిదీ వివాదం చేయడం మానుకోండి .. దమ్ముంటే బన్ని రికార్డులను బద్దలు కొట్టండి ..లేదంటే కామ్ గా ఉండండి ” అంటున్నారు . మరి కొంతమంది ఫ్యాన్స్ రెచ్చిపోయి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకు బన్నీ రికార్డును ఢీకొట్టడం చేతకాకనే ఇలా బన్ని సినిమాను బాలీవుడ్ లో రిలీజ్ కాకుండా చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు .

ఈ క్రమంలోనే బన్నీ పుష్ప2 సినిమాపై బాలీవుడ్ లో నెగిటివ్ ప్రచారం జరుగుతుంది . అయితే బన్ని డై హార్ట్ ఫాన్స్ కోపంతో ఊగిపోతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో మగాళ్లు లేరా..? అంటూ ఘాటుగా కౌంటర్లు వేస్తూ ఉండడం తో సోషల్ మీడియా వ్యాప్తంగా బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది . చూడాలి దీనిపై బాలీవుడ్ హీరోలు ఏ విధంగా స్పందిస్తారో..?