బిగ్ షాకింగ్: ఇక పై సుమని అలా చూడలేమా..? నిజంగానే యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేస్తున్నారా..?

తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నా సరే సుమకు ఉన్న క్రేజ్.. రేంజ్ ..ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే అని చెప్పాలి . మరి ముఖ్యంగా పేరుకు కేరళ నుంచి వచ్చిన అమ్మాయి అయినా సరే తెలుగును అనర్కలంగా చాలా చక్కగా మాట్లాడుతూ వుంటుంది అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా స్టార్స్ అందరూ ఒక్కొక్కరుగా చెప్పుకొచ్చారు. కేవలం సుమ యాంకర్ గానే కాదు కెరీర్ స్టార్టింగ్ లో సినిమాలో కూడా నటించింది .

ఆశ్చర్యం ఏంటంటే సుమ సినిమాలో నటించిన ప్రతి సినిమా డిజాస్టర్ గా మారింది . యాంకర్ గా మాత్రం ఫుల్ జోష్లో దూసుకుపోతుంది . ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దాలు దాటుతున్న ఇంకా యాంకర్ గా కొనసాగిస్తుంది అంటే సుమలో ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా ఇటీవల కాలంలో సుమ హవ్వ కొంచెం తగ్గిందనే చెప్పాలి . అప్పట్లో యాంకరింగ్ చేస్తున్న సరే ఆమెను ఆదరించే జనాలు తగ్గిపోతున్నారు . మరీ ముఖ్యంగా ఇటీవల సుమ అడ్డ అనే పేరుతో ఓ టాక్ షో ని స్టార్ట్ చేసింది . ఇది అనుకున్నంత సక్సెస్ కాకపోవడం కూడా సుమ కెరియర్ కు మైనస్ గా మారింది .

రీసెంట్ గా ఓ ఇంజీనీరంగ్ ఫేస్త్ కు గెస్ట్ గా వెళ్లిన ఆమె కాసేపు విద్యార్థులతో ముచుట్టించారు. ఈ క్రమంలోనే స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా – చిలిపిగా – నాటీగా సమాధానం చెప్పారు . ఈ క్రమంలోనే ఓ విద్యార్థి యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారా..? అని అడిగిన ప్రశ్నకు ..”అది నా చేతుల్లో లేదు ..నన్ను భరించాల్సిందే ” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో యాంకరింగ్ కి సుమ గుడ్ నై చెప్తుంది అన్న వార్తల్లో నిజం లేదు అంటూ తేలిపోయింది.

“ఫ్యూచర్లో నటిగా ఏదైనా సినిమాలో నటించవచ్చా..?” అంటే ..”నాకు యాంకరింగ్ అంటేనే ఇష్టం. యాక్టింగ్ వద్దులే .. అది మనకు ఎందుకో కలిసి రావడం లేదు ” అంటూ తన ముందు సినిమాలను గుర్తు చేసుకుంటూ ఆ సినిమాల డిజాస్టర్ ని చెప్పకనే చెప్పేసింది . ఈ క్రమంలోనే సుమ యాంకరింగ్ కి గుడ్ బాయ్ చెప్పడం లేదని.. కేవలం నటనకే గుడ్ బాయ్ చెప్తుంది అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి..!!