పొట్టి బట్టల్లో యాంకర్ రష్మి అరాచకం.. అమ్మడి బీచ్‌ లుక్స్‌ చూస్తే మతిపోతుంది!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది యాంకర్ రష్మి. అందంతోపాటు మంచి మనసున్న ఈ ముద్దుగుమ్మ చాలామంది అభిమానులను సంపాదించింది. ఒకవైపు బుల్లితెరపై కొనసాగుతూనే మరోవైపు వచ్చిన సినిమా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. అలా వచ్చిన వాటిలో గుంటూరు టాకీస్ హీరోయిన్ రోల్‌కి 100% న్యాయం చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. మూగ జంతువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తుంటుంది. అలానే తన హాట్ ఫొటో షూట్లను పంచుకుంటూ సెగలు పుట్టిస్తుంది.

రీసెంట్ రోజుల్లో ఈ ముద్దుగుమ్మ సమ్మర్ వెకేషన్ అంటూ పొట్టి బట్టలలో తిరిగేస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అభిమానుల హార్ట్ బీట్ పెంచేస్తోంది. తాజాగా యాంకర్ రష్మి పొట్టి నిక్కర్ ధరించి బీచ్ లో దిగిన ఫొటోలను షేర్ చేసుకుంది. వీటిలో అమ్మడి థైస్‌ బీభత్సంగా కనిపించాయి. ఈ అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ముగ్దులవుతున్నారు.

ఇకపోతే రష్మి ఇప్పుడు జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకరింగ్ అందిస్తోంది. ఇప్పటికీ ఈ అమ్మడి అందాలు ఏమాత్రం తగ్గలేదు ఇక మొదట్లో ఉన్న జోష్ ఇప్పటికీ కనిపిస్తోంది. జబర్దస్త్ ఎపిసోడ్స్ ఎంట్రీ సాంగులకు రష్మీ వేసే డాన్సులు ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి.

ఇటీవల కాలంలో రష్మి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో మెరిసింది. ఏడాది ఆగస్టులో రిలీజ్ కానున్న బోళా శంకర్ సినిమాలో కూడా కనిపించనుంది. ఈ మూవీలో రష్మి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక రష్మికి లవర్‌గా బుల్లితెరపై కొనసాగిన కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. జబర్దస్త్ కి దూరమైన ఈ హాస్యనటుడు కొద్ది రోజులకు గాలోడు సినిమాతో  బాక్సాఫీస్ ను షేక్‌ చేశాడు.