“టార్గెట్ ఆ పెద్ద మనిషే”.. బాలయ్య ‘అఖండ 2’ పై క్రేజీ అప్డేట్..!!

టాలీవుడ్ నందమూరి నట సిం హం హీరోగా నటించిన సినిమా అఖండ. డిసెంబర్ 2 – 2021న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది . అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీగా రికార్డు నెలకొల్పింది. అప్పట్లో కరోనా మూమెంట్లు సినిమా ఇండస్ట్రీలో సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్న జనాలకు స్టార్స్ కు బాలయ్య అండగా నిలిచి ధైర్యం చెబుతూ ఈ సినిమాను రిలీజ్ చేసి బాక్సాఫీస్ కి కొత్త ఊపిరి తీసుకొచ్చారు .

సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మూవీ గా నిలిచిన అఖండకు సీక్వెల్ రావాలి అంటూ నందమూరి ఫ్యాన్స్ గత కొంతకాలంగా చెప్పుకొస్తూనే ఉన్నారు . కాగా రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే అఖండ 2 సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . మహాశివరాత్రికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ట్వీట్ చేస్తూ.. అఖండ మొతమోగుతుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే జూన్ 10 న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు ఈసారి అఖండ 2 మొత్తం పాలిటిక్స్ పై బాలయ్య కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . మరీ ముఖ్యంగా టిడిపి పార్టీని మొదటి నుంచి టార్గెట్ చేసి ట్రోల్ చేసి కావాలని అరెస్టులతో సతమతం చేసిన ఓ పెద్దమనిషిని టార్గెట్ చేస్తూ ..బాలయ్య ఈ సినిమాలో విజృంభించి నటించే విధంగా బోయపాటి స్కెచ్ వేశారని.. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సగంకి పైగా పూర్తి అయిపోయాయిందని తెలుస్తుంది .

ఈ క్రమంలోనే ఒకవేళ ఇది నిజంగా నిజమైతే మాత్రం 2024 ఎలక్షన్స్ లో టిడిపి అధికారంలోకి రావడానికి ఈ అఖండ 2 సినిమా హెల్ప్ చేస్తుంది అంటూ టిడిపి శ్రేణులు కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు నటుడుగా కూడా బాలయ్యను మరో మెట్టు ఎక్కించే విధంగా బోయపాటి ఈ కథను రాసుకున్నారట . చూడాలి మరి అఖండ 2 తో బాలయ్య ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో.. ఎలాంటి రికార్డులను బద్దలు కొడతాడో..?