త్రిష చేసిన పాపమే మళ్లీ ఇన్నాళ్లకు ఆమెకే శాపంగా మారిందా..!!

కోలీవుడ్ ,టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. త్రిష ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఇప్పటికీ హీరోయిన్లు సైతం కుళ్ళు కుంటు ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాని, సినీ ఇండస్ట్రీని షేర్ చేస్తూనే ఉంది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 17 సంవత్సరాలు పైనే కావస్తున్న అప్పటికి ఇప్పటికీ అదే అందంతో మెయింటైన్ చేస్తోంది త్రిష.. తాజాగా త్రిష ఒకప్పుడు చేసిన తప్ప ఇప్పుడు ఆమె పాలిట శాపంగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Trisha Krishnan's Alleged Relationships, Broken Engagement, Expensive Cars,  Luxurious Home And More
అసలు విషయంలో వెళితే.. త్రిష కెరియర్ స్టార్టింగ్ లో పక్క హీరోయిన్స్ కమిటీ అయిన సినిమాలను రెమ్యూనరేషన్ తగ్గించుకోనీ మరి ఇతర హీరోయిన్స్ నటించే సినిమాలలో నటించేది.. అలా నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు అయ్యాయి..కానీ ఇతర హీరోయిన్ సక్సెస్ లను తన ఖాతాలోకి వేసుకుంది త్రిష అంటూ అప్పట్లో ట్రోల్ ఎక్కువగా చేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి సిచువేషన్ హీరోయిన్ త్రిషకి ఎదురవుతోంది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

త్రిష ఒక్కో చిత్రానికి ప్రస్తుతం రూ.4 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది.. ఈ క్రమంలోనే డైరెక్టర్ త్రిష అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వలేకపోతున్నారట. దీంతో త్రిష కన్న తక్కువ రెమ్యూనరేషన్ దొరికే హీరోయిన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని సినిమాలలో పెట్టుకొని మంచి హిట్ కొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దీంతో త్రిష చేతిలో నుంచి భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవలసి వచ్చింది. త్రిష ఆశపడిన ప్రాజెక్టు ఆమె చేతిలో నుంచి జారిపోవడంతో చాలా డిసప్పాయింట్ అవుతున్నట్లు సమాచారం.. దీనినే కర్మ అంటారు అని పలువురి నేటిజనన్లు త్రిష ను ట్రోల్ చేస్తున్నారు.