సమంత కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా..?

హీరోయిన్ సమంత గడచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో శర వేగంగా పాల్గొంటుంది.. దీని ద్వారా ప్రస్తుతం ప్రేక్షకుల మధ్యలోకి కూడా వెళ్లి తన వంతు ప్రయత్నం గా ఈ సినిమా కోసం ప్రయత్నిస్తూనే ఉంది సమంత. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం సమంత వ్యక్తిగతంగా కూడా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి చాలా సహాయపడుతోంది .ఈ నేపథ్యంలోనే తన గురించి తన వ్యక్తిగత అలవాట్ల గురించి కూడా తెలియజేయడం జరిగింది.

Samantha Akkineni Learns To Cook Healthy Food For Hubby, Naga Chaitanya But  Looks Like A Pro Already
సమంత తాజాగా మాట్లాడుతూ తన ఆహారపు అలవాట్లను కూడా రివీల్ చేసింది.. తన డైట్ ఫుడ్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. తనకి ఇష్టమైన ఆహారాలు ఎలా ఉంటాయో కూడా తెలియజేసింది. ఫిట్ గా ఉండేందుకు ముఖ్యంగా పీనట్ బట్టర్ ఓట్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటానని అయితే అలా తీసుకున్నప్పటికీ టిఫిన్ లో మాత్రం కచ్చితంగా ఇడ్లీ ,సాంబార్ ఉండాలని తెలిపింది.. ఇడ్లీ సాంబార్ ఉంటే మాత్రం తమిళ వాసిగా సాంబారుని ఎక్కువగా ఇష్టపడతానని తెలిపింది. ముఖ్యంగా అందులో సాంబార్ని జుర్రడం లో తానంత స్టైలిష్ గా ఎవరూ ఉండరని తెలియజేస్తోంది. ఎందుకంటే తన ఇంట్లో తల్లి చేసే సాంబార్ అంత రుచిగా ఉంటుందని తెలిపింది.

Everything that Samantha Ruth Prabhu eats in a day to stay fit | Times of  India
అలాగే ఫిల్టర్ కాఫీ అన్నా కూడా చాలా ఇష్టమని ఇంకా పరమాన్నం, బిర్యానీ ,సాంబార్ రైస్ వంటివి చూశాక వాటి రుచి చూడకుంటే తనకి ఆ రోజంతా అలదోలాగా ఉంటుందని తెలిపింది..ఇక స్వీట్లు డైరీ మిల్క్ పాలకోవా అంటే చాలా ఇష్టమని అయితే వీటిని మాత్రం బ్యాలెన్స్గా తింటానని తీపి కావడం చేత కొద్దిగా తింటే కడుపు నిండిపోతుంది.. అందుకే చాలా తక్కువగా తింటానని తెలిపింది. అలాగే వారంలో మాత్రం ఒక్కరోజు మసాలా వంటలను రుచి చూస్తానని తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.