మీనా జీవితాని సర్వ నాశనం చేసిన ఆ స్టార్ హీరో..? బలవంతంగా తల్లి ఆ పని చేయించిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ బాలీవుడ్లో తనదైన స్టైల్లో సినిమాలో నటించి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మీనా.. అప్పట్లో కుర్రాలను తన అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసేసింది. మరీ ముఖ్యంగా అప్పట్లో స్టార్ హీరోలు అందరూ మీనా తోనే నటించడానికి ఇంట్రెస్ట్ చూయించారు ..అంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి అందరి హీరోలతో వరుసగా జతకట్టి హ్యూజ్ బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకుంది .

 

కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న మీనా రీసెంట్ గానే భర్తను పోగొట్టుకునింది. పోస్ట్ కోవిడ్ సింప్టమ్‌స్ కారణంగా మీనా భర్త మరణించారు. కాగా అప్పటినుంచి కొంచెం డల్ గా ఉన్న మీనా ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్గా మారింది .

 

కాగా ఈ మధ్య కాలంలో మీనా కి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. త్వరలోనే మీనా రెండో పెళ్ళి చేసుకోబోతుంది అని ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. దాని పై కూడా మీనా స్పందించింది..భర్త పోయి పుట్టెడు బాధలో నేను ఉంటే ఇలా..టార్చర్ చేయకండి అని రిక్వెస్ట్ చేసింది.

కాగా ఇప్పుడు మరోసారి తన పై ఇలాంటి న్యూస్లే వైరల్ అవుతున్నాయి. “నిజానికి మీనాకి విద్యాసాగర్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట . వేరే హీరోని ప్రేమించిందట. పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని చేసుకోవాలనుకున్నానని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందట. ఇదే విషయం వాళ్ళ అమ్మకి చెప్పిందట..కానీ వాళ్ళు ఆమెను బలవంతంగా విద్యాసాగర్ కి ఇచ్చి పెళ్లి చేయించారట”. పెళ్ళి తరువాత కాంప్రమైజ్ అయ్యి బ్రతికేస్తున్న మీనాకి దేవుడు కూడా అన్యాయం చేసాడు. చిన్న వయసులోనే భర్తను తిరిగిరానిలోకాలకు తీసుకెళ్లిపోయాడు..అంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు..!!

 

Share post:

Latest