అందాలు ఆరబోస్తున్న సమంత.. హాట్‌హాట్‌గా ఫొటోషూట్‌లు

తెలుగు నాట సమంత అంటే తెలియని వారుండరు. ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను ఆమె చేసింది. దాదాపు ప్రతి అగ్రహీరో సరసన నటించింది. చలాకీగా, పక్కింటి పిల్లగా ఎన్నో సినిమాలు ఆమె తన నటనను ప్రదర్శించింది. ఇక సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. సినీ హీరో నాగచైతన్యతో ప్రేమ, కొన్నాళ్లకు పెద్దల సమక్షంలో వివాహం, కొన్నేళ్లకు పొరపచ్చాల వల్ల విడాకులు ఇలా చకచకా అన్నీ జరిగిపోయాయి. ఆమె ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా దేశవ్యాప్తంగా మరింత పాపులర్ అయింది. అయితే ఇటీవలే ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడడంతో అంతా సానుభూతి కురిపించారు. ఆమె కోలుకోవాలని అభిమానులు ఎంతో ఎదురు చూశారు.

మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటేనే యశోద సినిమాను ఆమె పూర్తి చేసింది. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ సినిమాలో ఆమె నటిస్తోంది. చాలా రోజుల విరామం తర్వాత ఇటీవల షూటింగ్‌లో సమంత జాయిన్ అయింది. విడాకుల తర్వాత తన హద్దులను సమంత చెరిపేసింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు ఐటమ్ సాంగ్‌లు, గ్లామర్ పాత్రలు పోషిస్తోంది. తాజాగా తన అందచందాలను ఆరబోస్తూ ఫొటోషూట్‌లు చేసింది. ఈ ఫొటోలను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. సమంత అందాలను చూసి నోరెళ్లబెడుతున్నారు.


మయోసైటిస్ వల్ల తానేమీ క్రుంగిపోలేదని, తనలో సత్తా ఇంకా తగ్గలేదని ఆమె ఆ ఫొటోషూట్స్ ద్వారా సందేశాన్ని పంపింది. ఇక సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో నటించనుంది. కొన్ని ఇంకా చర్చల దశలో ఉన్నాయి. యశోద, ఖుషీ కాకుండా సౌత్ ఇండియాలో ఆమె మరో సినిమాలో చేయడం లేదు. ఇక బాలీవుడ్‌లో పాగా వేయాలని సమంత భావిస్తోంది. తన కెరీర్‌ను అక్కడ డెవలప్ చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.