డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు వీరి విభేదాలు బట్టబయలు అయ్యాయి. `నా వాళ్ళ మీద విష్ణు దాడి చేస్తున్నాడు. ఇదీ సిట్యుయేషన్` అంటూ అన్న మీద ఆరోపణలు చేస్తూ మనోజ్ నిన్న సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన వీడియో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
దీంతో మనోజ్, విష్ణు మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయని ప్రచారం జరుగుతుంది. అయితే అది చిన్న గొడవ అంటూ విష్ణు వివరణ ఇచ్చారు. అయినా సరే మంచు బ్రదర్స్ వివాదంపై అటు ప్రధాన మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ చర్చలు సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మనోజ్ పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది.
`కళ్ళ ముందు జరుగుతున్న తప్పులు చూసి చూడనట్లు వదిలేసి బతకడం కన్నా నిజం కోసం పోరాటం చేసి చావడానికైనా సిద్ధమే` అని రాసి ఉన్న కోట్ తో పాటు `క్రియేటివిటీకి నెగెటివిటీయే శత్రువు` అని మరో కోట్ ను పంచుకున్నాడు. `మీరు బతకండి.. ఇతరులను కూడా బతకనివ్వండి` అంటూ దండం పెడుతున్న ఎమోజీని క్యాప్షన్ లో జోడించాడు. దీంతో మనోజ్ పోస్ట్ వైరల్ గా మారింది. అసలు మనోజ్ ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టాడు..? దాని అర్థం ఏమిటి? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
https://www.instagram.com/p/CqM_LOxSxsp/?utm_source=ig_web_copy_link