8 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `ధ‌మ్కీ` ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే షాకే!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజాగా `దాస్ కా ధ‌మ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. వన్మయి క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్‌ సినిమాస్ బ్యానర్ల‌పై కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు.. ద‌ర్శ‌క‌త్వ బాధ‌త్య‌లు కూడా తీసుకున్నాడు. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా న‌టించింది.

 

ఈ సినిమా ఉగాది కానుక‌గా మార్చి 22న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. అయినా స‌రే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ దుమ్ము దులిపేస్తోంది. రూ. 8 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు రోజుల్లో ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే షాకైపోతారు.

తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏకంగా రూ. 3.06 కోట్లు, రెండో రోజు రూ. 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మూడో రోజు రూ. 1.02 కోట్ల రేంజ్ లో షేర్ ని ద‌క్కించుకోగా.. వరల్డ్ వైడ్ గా రూ. 1.33 కోట్ల రేంజ్ లో షేర్ ని కొల్ల‌గొట్టింది. ఇక ఏరియాల వారీగా దాస్ కా ధ‌మ్కీ 3 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం: 2.05 కోట్లు
సీడెడ్: 73 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 64 ల‌క్ష‌లు
తూర్పు: 42 ల‌క్ష‌లు
పశ్చిమ: 26 ల‌క్ష‌లు
గుంటూరు: 49 ల‌క్ష‌లు
కృష్ణ: 33 ల‌క్ష‌లు
నెల్లూరు: 21 ల‌క్ష‌లు
——————————————
ఏనీ+తెలంగాణ‌= 5.13 కోట్లు(9.50 కోట్లు~ గ్రాస్‌)
——————————————

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 76 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌: 97 ల‌క్ష‌లు
——————————————-
వ‌ర‌ల్డ్ వైడ్ టోట‌ల్‌ కలెక్షన్స్ = 6.86 కోట్లు(13.55 కోట్లు~ గ్రాస్)
——————————————-

కాగా, రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే రూ. 6.86 కోట్ల రేంజ్ లో షేర్‌ను సొంతం చేసుకుంది. ఇంకా రూ. 1.14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే ధ‌మ్కీ క్లీన్ హిట్ గా నిలుస్తుంది.