ఓరి నీ దుంప తెగ..ప్రభాస్‌ తో అలాంటి పనులేంట్రా బాబు..? మారుతి ఇకి మూడిందా..?

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న మారుతీ ఇలాంటి తల తిక్క పనులు కూడా చేస్తాడా అంటూ జనాలు మండిపడుతున్నారు . లేకపోతే పాన్ ఇండియా లెవెల్ లో పాపులరిటి సంపాదించుకొని ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారు మ్రోగి పోయే విధంగా చేసుకున్న ప్రభాస్ తో ఇలాంటి చీప్ పనులు చేయిస్తాడా ..? అంటూ రెబెల్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

మనకు తెలిసిందే మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చిందే లేదు . కానీ బ్యాగ్రౌండ్ లో మాత్రం అన్ని పనులు జరిగిపోతున్నాయి . ఈ సినిమాకి రాజా డీలక్స్ గా నామకరణం ఎప్పుడో చేసేసారు.. ఫిలిం చాంబర్ లో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. అయినా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. దానికి రీజన్ ఏంటో మారుతీకే తెలియాలి.

రీసెంట్ గా మారుతి – ప్రభాస్ తో సినిమాలో షాట్ లో భాగంగా గిన్నెలు తోమిస్తాడట . ఇదే న్యూస్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజా డీలక్స్ సెకండ్ షెడ్యూల్ లో భాగంగా ప్రభాస్ సినిమా లో వచ్చే సీన్ అనుసారంగా వంట పనులు చేయిస్తాడట. లవర్ ని మెప్పించడానికి వంట పనులు ఇంటి పనులు చేయాల్సి ఉంటుందట. దీంతో నేచురాలిటి కోసం నిజంగానే ప్రభాస్ దగ్గర ఇంటి పనులు చేయించాడట డైరెక్టర్. దీంతో మా ప్రభాస్ దగ్గర ఇలాంటి పనులు చెయిస్తావా..? హౌ డేర్ యు అంటూ మారుతిని ఏకీపారేస్తున్నారు జనాలు. మరోపక్క ఎలాంటి మగాడైనా సరే లవ్ కోసం ఆ పనులు చేయాల్సిందే బ్రదర్ అంటూ కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ప్రభాస్ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది..!!