శత్రువులకు థాంక్స్ చెప్పిన కంగనా.. మీరేంటో ఎవరికీ అర్థం కాదు కదా!

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకెక్కుతూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో ఒకరు. బాలీవుడ్ హీరోలకు సమానమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. వివాదాలలో నిలిచినప్పటికీ ఈ అమ్మడుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వివాదాలను, సినిమాలను వేరువేరుగా చూస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా రనౌత్ తన 36వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. ఇక పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ చెప్పిన తన అభిమానులు, ఫాలోవర్స్ తో పాటు శత్రువులకు కూడా థాంక్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో కంగనా ఎంతో పద్ధతిగా చీర కట్టుకొని, బంగారు నగలను వేసుకొని మాట్లాడుతూ ‘నా పుట్టినరోజు సందర్భంగా నా తల్లిదండ్రులు, మా కుల దైవం, అభిమానులు, శ్రేయోభిలాషులతో పాటు నన్నెప్పుడూ విశ్రాంతి తీసుకోనివ్వని నా శత్రువులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా కష్టం, పోరాటాల వల్లనే నేను విజయాలను అందుకుంటున్నాను. మంచి ఆలోచనలు కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తాను. ఫ్రెండ్స్ నా భావజాలం, ప్రవర్తన చాలా సరళమైనది. ఎల్లప్పుడూ అందరికీ మంచి జరగాలని మాత్రమే కోరుకుంటాను. కొన్నిసార్లు దేశ సంక్షేమం కోసం మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే వారందరికీ క్షమాపణ చెబుతున్నాను. మీ అందరిపట్ల నాకు అభిమానం, సానుకూల ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. ఎవరి పట్లా ఎలాంటి ద్వేషం లేదు ‘ అని చెప్పుకొచ్చింది కంగనా.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)