ఆదివారం టీవీ పెడితే అదే గోల.. పబ్లిక్ గా ఆ హీరో నిజస్వరూపం బయటపెట్టిన బాలయ్య.. ఏం డేర్ రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోలు చాలా తక్కువ . పైగా మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి హీరోలు నూటికో.. కోటికో ఒకరు కనిపిస్తూ ఉంటారు. అయితే అందులో మొదటి స్థానంలో ఉంటాడు నందమూరి బాలకృష్ణ . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ . ఎంత నిజాయితీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసి ఎలాంటి సిచువేషన్ ని అయిన ఫేస్ చేయడంలో బాలకృష్ణ తర్వాత ఏ హీరో అయినా.. అని చెప్పాలి.

రీసెంట్గా ఇండియన్ ఐడల్ 2 అనే షోకి బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ క్రమంలోనే తనదైన స్టైల్ లో అలరిస్తూ కంటెస్టెంట్స్ తో ముచ్చటిస్తు వచ్చాడు బాలయ్య . ఇదే షోకి హీరో నవదీప్ ..హీరోయిన్ బిందు మాధవి తమ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా హాజరయ్యారు . ఈ క్రమంలోని తనదైన స్టైల్ నవదీప్ తో ఆడుకునేసాడు బాలయ్య . షోలోకి నవదీప్ రాగానే ఆయన ని ఉద్దేశిస్తూ బాలకృష్ణ మాట్లాడుతూ..” ఏంటో ఆదివారం టీవీ పెడితే చాలు శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన నవదీప్ ..కారు వదిలి వెళ్ళిపోయిన నవదీప్ అంటూ హెడ్ లైన్స్ వస్తూనే ఉంటాయి .”.

“నీ గురించి ఒకటే రచ్చ జరుగుతుంది” అంటూ బాలకృష్ణ ఓపెన్ గా చెప్పారు . అయితే ఈ విషయాన్ని లైట్గా తీసుకొని ఆ సిచువేషన్ ని కూల్ చేసేసాడు. అయితే బాలకృష్ణ చెప్పిన దాంట్లో తప్పులేదు .. నిజంగానే ఎన్నోసార్లు నవదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. ఆ వీడియోస్ సోషల్ మీడియాలో టీవీలో వైరల్ అవుతూనే ఉంటాయి . ప్రజెంట్ నవదీప్ పై బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . దీనిపై నెటిజన్స్ స్పందిస్తూ బాలకృష్ణ డేర్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో నీ తర్వాతే ఎవరైనా అంటూ ట్రెండ్ ఇస్తున్నారు..!!

 

Share post:

Latest