అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ కాదా..?

ఒకప్పుడు సినీ హీరోల అభిమానులు సందడి చేస్తూ రోడ్లమీద థియేటర్ల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి కొనసాగిస్తూ ఉన్నారు. తమ హీరోల పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. పలు రకాల ట్యాగ్ లతో వారిని ట్రెండీగా చేస్తూ ఉంటారు అభిమానులు. అల్లు అర్జున్ అభిమానులు చేసిన ఒక పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని ఆకర్షించేలా కనిపిస్తోంది..

Allu Arjun: మీ వ‌ల్లే నేనిక్క‌డే.. 20 ఏళ్ల జ‌ర్నీపై అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్  లెట‌ర్‌ - allu arjun emotional letter on his 20 years of his film journey -  Samayam Telugu

అదేమిటంటే ఈమధ్య కాలంలో గ్లోబల్ అనే పదం ఒక పెద్ద సెన్సేషనల్ గా మారిపోయింది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు గ్లోబల్ స్టార్ అనే పదం తమ హీరోది అంటే తమ హీరోది అని రచ్చ చేస్తూ ఉంటారు. తాజాగా నిన్నటి రోజున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్తడే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని ట్యాగ్ ట్విట్టర్లు ట్రెండీగా మారిపోయింది. అదే విధంగా మహేష్ బాబు 28వ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో మహేష్ బాబును కూడా ఆ టాగ్ తో ట్రెండీగా చేశారు.

Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) / Twitter

అసలు ఏమాత్రం సంబంధంలేని విధంగా అల్లు అర్జున్ పేరు కూడా ఈసారి ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు గతంలో అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు కానీ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా పేరు మార్చారు. దానిని ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్లు గ్లోబల్ ఐకాన్ అల్లు అర్జున్ అని పేరుతో ఒక ట్యాగ్ని సృష్టించి తెగ వైరల్ గా చేస్తున్నారు. వాస్తవానికి అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో ఏమి సాధించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.. రామ్ చరణ్ ఎన్టీఆర్ అంటే RRR చిత్రం వల్ల ఆ స్థాయిలో పేరు సంపాదించారు కానీ పుష్ప సినిమా కేవలం కొన్ని దేశాలలోని గుర్తింపు సంపాదించింది

Share post:

Latest