రామ్ చ‌ర‌ణ్ ధ‌రించిన ఆ సింపుల్ ష‌ర్ట్ ధ‌ర తెలిస్తే మ‌తిపోతుంది!

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`తో గ్లాబ‌ల్ స్టార్ గా అవ‌త‌రించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిన్న 38వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. దీంతో నిన్నంతా సోష‌ల్ మీడియాలో రామ్ చ‌ర‌ణ్ పేరు మారుమోగిపోయింది. అభిమానుల‌తో పాటు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు చ‌ర‌ణ్ కు బ‌ర్త్ డే విషెస్ ను తెలిపాడు.

అలాగే నిన్న సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. శ్రీ‌కాంత్‌, జ‌గ‌ప‌త‌బాబు, నాగార్జున ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీ, విజయ్ దేవరకొండ, కాజల్ అగర్వాల్ దంప‌తులు, నిఖిల్, మంచు మనోజ్, మంచు లక్ష్మి, కీరవాణి, దర్శకుడు మెహర్ రమేష్, ప్రశాంత్ నీల్, సుకుమార్ ఇలా ప‌లువురు సినీ ప్రముఖులు చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వేడుక‌ల్లో సంద‌డి చేశారు.

ఇదిలా ఉంటే.. చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిరంజీవి కొడుకుతో దిగిన ఓ ఫోటోను ట్విట్ట‌ర్ పంచుకుంటూ ఎంతో ఆప్యాయంగా బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. అయితే ఈ పిక్ లో చ‌ర‌ణ్ ధ‌రించిన ష‌ర్ట్ ఫ్యాన్స్ ను ఎంత‌గానో ఎట్రాక్ట్ చేసింది. దీంతో దాని ధ‌రెంతో షెర్చ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఫర్ ఫెక్ అనే కంపెనీకి చెందిన షార్ట్ ఇది. చూడ‌టానికి చాలా సింపుల్ గా ఉన్నా కాస్ట్ తెలిస్తే మ‌తిపోతుంది. ఎందుకంటే, చ‌ర‌ణ్ ధ‌రించిన ఈ సింపుల్ ష‌ర్ట్ ధ‌ర రూ. 80 వేలు. బ్రాండెడ్ కావ‌డం వ‌ల్లే అంత ధ‌ర ఉంద‌ని అంటున్నారు. అయితే రెగ్యుల‌ర్ గా కూడా చ‌ర‌ణ్ ఇంత ఖ‌రీదైన దుస్తులు వేసుకుంటాడా అంటూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు నెటిజ‌న్లు.

Share post:

Latest