`ద‌స‌రా` ఫ‌స్ట్ రివ్యూ.. నాని రాక్స్‌, థియేట‌ర్లు షేక్స్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ద‌స‌రా`. అవుట్ అండ్ అవుట్ ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. తెలంగాణలో ఉండే సింగరేణి నేపథ్యంలోని గోదావరిఖని బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమా మార్చి 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌ను ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌తో నాని అండ్ చిత్ర టీమ్ పీక్స్ కు తీసుకెళ్తున్నాడు. కాగా దసరా చిత్ర ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

విడుదలకు రెండు రోజుల ముందేఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తన అభిప్రాయం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. `దసరా పైసా వసూల్ మాస్ ఎంటర్టైనర్. పాన్ ఇండియా రేసులోకి నాని దూసుకొస్తాడు. దసరాలో నాని అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ తో క‌ట్టిప‌డేశాడు. ఇక‌ కీర్తి సురేష్ ఆటం బాంబులా పేలింది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పుష్ప 2.0` అని ఉమర్ సంధు రివ్యూ ఇచ్చాడు. అలాగే 3.5/5 రేటింగ్ ఇచ్చారు. ఈయ‌న రివ్యూతో నాని రాక్స్‌, థియేట‌ర్లు షేక్స్ అంటూ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని తెగ ఉత్సాహ ప‌డుతున్నారు.

Share post:

Latest