మహేష్ సిగరెట్ తాగితే సినిమా సూప‌ర్ హిట్టేనా.. ఇదెక్క‌డి సెంటిమెంట్ రా బాబు!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గొప్ప న‌టుడే కాదు మంచి మ‌న‌సు ఉన్న వ్య‌క్తి కూడా. ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నాడు. అటువంటి మ‌హేష్ ఒక‌ప్పుడు పెద్ద చైన్ స్మోకర్. ఒక రోజుకి నలభై సిగరెట్లు కాల్చేవాడట. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. మహేష్ సిగరెట్ తాగితే ఆ సినిమా సూప‌ర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉండేది.

ఇదెక్క‌డి సెంటిమెంట్ రా బాబు అనుకోకండి. ఉదాహ‌రణకి పోకిరి సినిమాను తీసుకోవచ్చు. ఈ చిత్రం లో మహేష్ సిగరెట్ తాగే స్టైల్ అప్పట్లో పెద్ద ట్రెండ్. పోకిరి ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఇక అతిథి మిన‌హా మ‌హేష్ సిగ‌రెట్ తాగిన ఒక్కడు, అత‌డు చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. అదే స‌మ‌యంలో మ‌హేష్ స్మోకింగ్ స్టైల్ కి ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో సెప‌రేట్ క్రిజ్ ఏర్ప‌డింది. అలాగే ఒక్క‌డు మూవీలో మ‌హేష్ స్మోకింగ్ స్టైల్‌ను యూత్ కూడా ఫాలో అయ్యారు.

అలాంటి స‌మ‌యంలో ఒక బుక్ చదివిన మ‌హేష్ సిగెరెట్ తాగడం పూర్తిగా మానేసాడు. సినిమాల్లో కూడా సిగరెట్స్ తాగ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నాడు. చాలా ఏళ్ల నుంచి ఆ నిర్ణ‌యంపై నిల‌బ‌డ్డ మ‌హేష్‌.. తాజాగా త్రివిక్ర‌మ్ సినిమాలో బీడీ కాలుస్తూ ద‌ర్శ‌న‌మిచ్చాడు. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్ లో మ‌హేష్ స్టైల్ అండ్ స్వాగ్ తో స్మోకింగ్ చేయ‌డం ఫ్యాన్స్ ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దీంతో `ఎస్ఎస్ఎమ్‌బీ 28` బాక్సాఫీస్ వ‌ద్ద ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయ‌డం ఖాయ‌మంటూ ఫ్యాన్స్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. కాగా, ఈ సినిమా 2024 సంక్రాంతికి విడుద‌ల కాబోతోంది.

Share post:

Latest