ఎన్టీఆర్ కి మరదలు పిల్ల దొరికేసిందోచ్.. NTR30 లో సెకండ్ హీరోయిన్ ఫిక్స్..!?

ఫైనల్లీ .. కొరటాల శివ అనుకున్నది సాధించేసాడు . ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సెకండ్ హీరోయిన్ ని పట్టేశాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ .. రీసెంట్ గానే ఆ సినిమాకి ఆస్కార్ అవార్డ్ సైతం అందుకున్నారు.

అయితే ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న ఎన్టీఆర్ .. త్వరలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమాతో తెరపైకి రాబోతున్నాడు . దీనికి సంబంధించిన పూజా పనులు పూర్తయిన విషయం తెలిసిందే . ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా నుంచి కొన్ని పిక్స్ కూడా లీక్ అయ్యి.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కన్నడ బ్యూటీ కృతి శెట్టి ఫిక్స్ అయిన్నట్లు తెలుస్తుంది .

ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎన్టీఆర్ కి మరదలి రోల్ లో హీరోయిన్ కృతిశెట్టి ఫిక్స్ అయినట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ సెలక్ట్ అయ్యింది. కాగా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా రష్మిక, మృణాల్ ఠాకూర్ మధ్య టఫ్ కాంపిటీషన్ జరగ్గా.. ఫైనల్లీ ఈ పాత్రకు ట్రెడిషనల్ లుక్స్ ఉంటేనే బాగుంటుంది అంటూ కొరటాల శివ ఎన్టీఆర్ 30 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కన్నడ బ్యూటీ కృతి ని ఫిక్స్ చేశాడట. అంతేకాదు రీసెంట్గా రిలీజ్ అయిన బ్లడ్ ట్యాంకర్ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో పూర్తిస్థాయిలో యాక్షన్ సీన్స్ ఉంటాయి అంటూఇప్పటికే హింట్ వచ్చేసింది. అన్ని చూస్తుంటే ఈ సినిమాతో మరో ప్రభంజనం సృష్టించబోతున్నాడు తారక్ అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు..!!

 

Share post:

Latest