స్టార్ హీరో తో ప్రేమ‌లో ప‌డ్డ కీర్తి సురేష్‌.. ఇంత‌కంటే క్లారిటీ కావాలా బ్రదర్స్..?

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రేమలో పడింది అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . అయితే అలాంటి వార్తలు పై కీర్తి సురేష్ వాళ్ళ అమ్మగారు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే అలాంటిదేమీ లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . అయినా కానీ ఎందుకు తెలియదు కీర్తి సురేష్ పై అలాంటి వార్తలు రోజు రోజుకి ఎక్కువ వినిపిస్తూనే ఉన్నాయి.

కాగ రీసెంట్గా కీర్తి సురేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా దసరా . కొద్ది గంటల క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో తోనే సూపర్ హిట్ టాక్ ని నమోదు చేసుకుంది . ఈ క్రమంలోనే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించిన తీరు జనాలకు అమితంగా నచ్చేసింది. ఇలాంటి క్రమంలోని కోలీవుడ్లో కీర్తి సురేష్ ప్రేమ టాపిక్ వైరల్ గా మారింది.

స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ఓ హీరోతో ప్రేమలో పడిందని.. మరోసారి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే ఇలాంటి వార్తల పై కీర్తి సురేష్ అమ్మగారు స్పందించారు. ” కీర్తి సురేష్ ఎవరిని ప్రేమించడం లేదు.. ప్రెసెంట్ ఆమె తన కెరియర్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుంది..నిజంగా కీర్తి సురేష్ లైఫ్ లో అలాంటిది ఏదైనా ఉంటే మేమే చెప్తాం” అంటూ ఘాటుగా జవాబు ఇచ్చింది . ఈ క్రమంలోనే మరోసారి కీర్తి సురేష్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.