కొత్త డౌట్లు పుట్టిస్తున్న నాగ చైతన్య.. ఆ స్పెషల్ ఫోటో డిలిట్..!!

ఏంటో ఈ నాగచైతన్య తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియట్లేదు కానీ ..తెలిసి తెలియక చేసిన తప్పుకు సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కై తన పేరుని ట్రోల్ చేసుకుంటున్నారు . మనకు తెలిసిందే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో. మరి ముఖ్యంగా శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ అంటూ ఆయన పేరుని రచ్చ రంబోలాగా చేసేస్తున్నారు ట్రోలర్స్ .

స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య .. వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చేశాడు . ఆ తర్వాత సింగిల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న నాగ చైతన్య.. లైఫ్ లోకి ఫ్రెండ్షిప్ పేరుతో శోభిత ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫ్రెండ్ షిప్ ఇప్పుడు ప్రేమగా మారి త్వరలోనే పెళ్లి బంధానికి దారితీస్తుంది అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా లండన్ లో శోభుతా ధూళిపాల తో నాగచైతన్య ఒకే రెస్టారెంట్లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది .

ఆ రెస్టారెంట్లో పని చేసే చెఫ్ ఈ పిక్ ను పోస్ట్ చేశారు . దీంతో వీళ్ళ సీక్రెట్ బట్టబయలు అయింది. అయితే గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉండడంతో.. ఆయన ఈ ఫోటోని డిలీట్ చేశారు . అయితే అక్కినేని ఫ్యామిలీ .. సీక్రెట్ రిలేషన్షిప్ ని అప్పుడే బయటపెట్టడం ఇష్టం లేక ఆ ఫోటోని డిలీట్ చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే నాగచైతన్య – శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడు అన్న రూమర్లకు ఆజ్యం పోసినట్లైంది. త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు..!!