వామ్మో..ఏంటి సమంత అంత తోపా.. విజయ దేవరకొండని బకరా చేసేసారుగా..!?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఇక తర్వాత హిట్లు ఫ్లాపులు అంటూ తేడా లేకుండా ఏదో తనకు వచ్చిన అవకాశాలలో నచ్చిన సినిమాలను చేసుకుంటూ అలా అలా హీరోయిన్ గా ..స్టార్ హీరోయిన్గా ..ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది . విడాకుల తరువాత ఆమె ఎలా కేర్ఫుల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే మయోసైటీస్ వ్యాధికి గురైన సమంత రీసెంట్గానే తాను కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ లో పాల్గొనింది .

కాగా నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె నటిస్తున్న ఖుషీ టీం ఆమెను సర్ప్రైజ్ చేసింది . ఈ మేరకు సెట్స్ లో హ్యాపీ ఉమెన్స్ డే అవర్ స్ట్రాంగ్.. పవర్ ఫుల్.. ఇన్స్పైరింగ్ లేడీ అంటూ సమంత స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ..సమంత చేత కేక్ కట్ చేయించారు. ఈ క్రమంలోనే సెట్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ, సమంత , డైరెక్టర్, మిగతా టీం సమంతకి కేక్ కట్ చేసి తినిపించారు . అయితే ఆశ్చర్యం ఏంటంటే కేవలం అసెట్స్ లో ఉమెన్ సమంతనే కాదు ఎంతోమంది లేడీస్ ఉన్నారు. కానీ అంతమందిని కాదని సమంత చేత కేక్ కట్ చేయించడం మిగతా వాళ్ళకి ప్రియారిటీ ఇవ్వకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతెందుకు అర్జున్ రెడ్డి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ని సైతం ఖుషి సెట్స్ లో సెకండ్ లీడ్ గానే చూస్తున్నారు కానీ, హీరోగా ఎవరు చూడట్లేదట . దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా హార్ట్ అవుతున్నారు . సమంత హీరోయిన్ నే కాదు అనట్లేదు ..విజయ్ దేవరకొండ అంతకన్నా పెద్ద హీరో ..అయితే ఈ విధంగా సమంతకి ప్రియారిటీ ఇవ్వడం విజయ్ దేవరకొండను అవమానించినట్టు అంటూ ఆయన ఫ్యాన్స్ ఫీల్ అయిపోతున్నారు .

దీంతో కొందరు విజయ్ దేవరకొండ బకరాని చేసేసారు అని కూడా కామెంట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.ఏది ఏమైనా సరే ఈ సినిమా హిట్ అయిన అది మొత్తం సమంత ఖాతాలోకే వెళ్ళిపోతుంది తప్పిస్తే విజయ్ దేవరకొండ ఖాతాలోకి రానే రాదు అంటూ జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు. ప్రెసెంట్ ఈ కేక్ కటింగ్ కి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

Share post:

Latest