అన్న దిగిండు.. `NBK108` నుంచి బాల‌య్య ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో తెర‌కెక్కుతున్న `108`వ చిత్రమిది. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. శ‌ర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాల‌య్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ అనంత‌రం బాల‌య్య నుంచి రాబోతున్న చిత్ర‌మిది.

ఇక‌పోతే నేడు ఉగాది పండుగ సంద‌ర్భంగా.. ఈ సినిమా నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా మేకర్స్ బ‌య‌ట‌కు వ‌దిలారు. `అన్న దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి` అంటూ ఈ సంద‌ర్భంగా అనిల్ రావిపూడి పేర్కొన్నాడు. నెరిసిన గ‌డ్డం, జుట్టుతో మాస్ లుక్ లో బాల‌య్య ఆక‌ట్టుకున్నాడు. ఫ్యాన్స్ కు బాల‌య్య ఫ‌స్ట్ లుక్ పిచ్చి పిచ్చిగా న‌చ్చేసింది. బాల‌య్య లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.