ప్రభాస్ కి ఇష్టం లేకుండా చేసిన ఏకైక సినిమా ఇదే.. రిజల్ట్ చూసి షాక్ అయిన కృష్ణం రాజు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ వస్తూ ఉంటారు ..పోతూ ఉంటారు . అయితే వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే అభిమానుల మనసును దోచుకుని వాళ్ళ గుండెల్లో చెరగని ముద్రను వేయించుకుంటారు . అలాంటి హీరోస్ కోసం ఫాన్స్ ఏమైనా చేస్తూ ఉంటారు. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడే రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఈ రెబల్ హీరో ..ఆ తర్వాత తన కెరీర్లో ఎన్నో ఫ్లాప్ చిత్రాలను అందుకున్నాడు . కాగా ప్రభాస్ అందుకున్న ఫస్ట్ హిట్ చిత్రం వర్షం .

ఈ సినిమా టైంలోనూ ప్రభాస్ రిలీజ్ చేయడానికి చాలా ఆలోచించారట . అప్పుడే మెగాస్టార్ చిరంజీవి- బాలకృష్ణ సైతం నటించిన సినిమాల రిలీజ్ అవుతుండడంతో తన సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందా అంటూ టెన్షన్ పడ్డాడట . ఇదే విషయాన్ని రీసెంట్గా వచ్చిన అన్ స్టాపబుల్ షో లో లీక్ చేశాడు. కాగా ఆ తర్వాత హిట్ అనేది ఆయన కి అలవాటుగా మారిపోయింది . కాగా మళ్ళీ కొంత కాలానికి వరుస ఫ్లాప్ లతో కెరియర్ డీలా పడిపోయింది . అయితే ఎప్పుడు కూడా ప్రభాస్ తన సినిమాలో ఫ్లాప్ అవుతున్నాయని బాధపడలేదట . కొత్త కంటెంట్ సరికొత్త ఐడియాలతో ముందుకు రావడానికి ట్రై చేసే వాడట.

ప్రజెంట్ ప్రభాస్ స్టేటస్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . సౌత్ లోనే ఒక్కో సినిమాకి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా రికార్డ్ నెలకొల్పాడు. కాగా, ప్రభాస్ తన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ప్రభాస్ కి కధ విని నచ్చక పోయిన చేసిన సినిమా మాత్రం బిల్లా. యస్..నిజానికి ఈ సినిమా చేయడం ప్రభాస్ కి ఇష్టం లేదట.. కానీ, స్టోరీ విని కృష్ణం రాజు..ఇంప్రెస్ అయ్యాడట. ఆ కారణంగానే ప్రభాస్ నచ్చకపోయినా ఈ సినిమా చేసాడట. ఇక సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఎలా వచ్చిందో అందరికి తెలిసిందే. పాపం సినిమా రిలీజ్ అయ్యాక కృష్ణం రాజు సైతం రిజల్ట్ చూసి షాక్ అయ్యాడట..!!