ఆస్కార్ బరిలో టాప్ -10 లో ఎన్టీఆర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ స్టార్ కు కూడా దక్కని అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకున్నారు.ఆస్కార్ సందడి అప్పుడే మొదలైంది అతి త్వరలోనే ఆస్కార్ అవార్డుల యొక్క నామినేషన్ ప్రకటించబోతున్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఆస్కార్ నామినేషన్లు ఎవరు ఉంటారనే విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారుతోంది. ఎవరికి అవార్డులు సాధ్యమనే విషయంపై ఊహాగానాలు ఇప్పటికి పలుకదుర్గ వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే ఈసారి ప్రముఖ వెరైటీ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ఉత్తమ నటులుగా ఎవరు ఆస్కార నామినేషన్లు తెలియజేశారు. పది మందితో కూడిన ఒక ఊహ జనక జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఉండడం అభిమానులకు కాస్త ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుకు పోటీపడుతున్న స్టార్స్ అంటూ మొహాది బజేస్తానీ, ఆస్టిన్ బట్లర్ , ఏడిన్ డాంబ్రెయిన్ , కోలిన్ ఫారెన్ , బ్రేండర్ ప్రెజర్, తదితర పేర్లను వెరైటీ మీడియా సంస్థ తెలియజేసింది.. ఇది జాబితాలో మొదటిసారి ఇండియన్ స్టార్ హీరో కి చోటు దాక్కడ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

RRR For Oscars' Patterns On Twitter After Well Known Magazine Predicts Jr NTR In Best Entertainer Top 10 Rundown » Web Trend Tak
టాలీవుడ్లో రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా గత ఏడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటన ఇప్పటికీ కూడా ఎంతోమంది ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో టాప్ టెన్ జాబితాలో వెరైటీ మీడియా సంస్థ ఎన్టీఆర్ పేరును తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.