విడాకుల కోసం భార్య ని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో .. విజయ్ పగిలిపోయే ఆన్సర్..!?

సోషల్ మీడియాలో గత 48 గంటల నుంచి కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నాడు అనే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో కూడా విజయ్ చురుగ్గా పాల్గొంటున్నాడు . కాగా ఇలాంటి టైం లో ఆయన తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు రావడంతో ఫ్యాన్స్ మండిపడుతున్నారు . కావాలనే కొందరు వారసుడు సినిమా పై నెగటివ్ ఇంపాక్ట్ పడేలా ఇలా వార్తలను పుట్టిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

అసలు విజయ్ తన భార్య సంగీతకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు ..? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలా అర్ధాంతరంగా విడాకులు తీసుకోవాలనుకుంటుందా ..?అంటూ కొందరు నెటిజన్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చ చేస్తున్నారు. కాగా అసలు విడాకుల రూమర్ ఎలా పుట్టింది అంటె.. ఈ మధ్యనే స్టార్ డైరెక్టర్ అట్లీ సతీమణి సీమంతం జరిగింది. ఈ వేడుకలో సంగీత ఎక్కడ కనిపించలేదు.

అంతేకాదు నిన్న కాక మొన్న చెన్నైలో వారసుడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగక ఆ ఈవెంట్ లోను సంగీత కనిపించలేదు . ఈ క్రమంలోని విజయ సంగీత మధ్య విభేదాలు వచ్చాయని.. ఆ కారణంగానే వాళ్ళు విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జోరు అందుకుంది అన్నట్లు తెలుస్తుంది . అయితే ఇవి పూర్తిగా అసత్యం అని విజయ్ – సంగీత హ్యాపీగా కలిసి ఉన్నారంటూ సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు విజయ్ కూడా ఇలాంటి ఫేక్ వార్తలపై మండిపడినట్లు సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి.