డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ హిట్స్, ఫ్లాప్స్ అయిన సినిమాలు ఇవే..

పోయిన ఏడాది అంటే 2022, డిసెంబర్‌లో ఎన్నడూ లేని విధంగా 38 తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ సినిమాలలో 35 సినిమాలు ప్రేక్షకులను కొంచెం కూడా అలరించలేకపోయాయి. కేవలం మూడు అంటే మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగలగాలి. అవి మాత్రమే హిట్ అయ్యాయి. ఆ హిట్ అయిన సినిమాలు మరేవో కావు అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్ నటించిన హిట్ 2, హాలీవుడ్ మూవీ అవతార్ 2, రవితేజ ఫిలిం ధమాకా.

ఇవి మినహా డిసెంబర్ నెలలో ప్రేక్షకులను పలకరించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద చితికిన పడి డిజాస్టర్స్ అయ్యాయి. డిసెంబర్ మొదటి వారంలో మట్టి కుస్తీ, జల్లికట్టు బసవ, నేనెవరు మూవీలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కామెడీ, రొమాన్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ లేవు కాబట్టి వీటి వైపు ప్రేక్షకుడి కన్నెత్తి కూడా చూడలేదు. దాంతో అవి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇక డిసెంబర్ సెకండ్ వీక్ లో రిలీజ్ అయిన సత్యదేవ్ తమన్నా మూవీ గుర్తుందా శీతాకాలం అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది. అత్యంత చెత్తగా మూవీ ఎలా తీయాలో చూపించగలిగిన ఒక సినిమాగా ఇది నిలిచింది. ఇక ముఖచిత్రం, పంచతంత్రం సినిమాలు థియేటర్లకి వెళ్లి చూసేంత గొప్పగా ఏమీ లేవు. దాంతో ఇవి కూడా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి.

డిసెంబర్ 16న అవతార్ 2 విడుదలై కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. అదే రోజున రిలీజ్ అయిన ఆక్రోశం, శాసనసభ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. తర్వాత వారంలో కనెక్ట్, లాఠీ వంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. వీటి కథలో సత్తా లేకపోవడంతో అవి కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. ధమాకా, 18 పేజెస్ ఒకేరోజు డిసెంబర్ 23న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. లాస్ట్ వీక్‌లో లక్కీ లక్ష్మణ్, డ్రైవర్ జమున, టాప్ గేర్, ఎస్5 సినిమాలు తెరకెక్కాయి. ఇవి కూడా నిరాశపరిచాయి.